This is one of the best songs

Best Song, Indian Rapper, sony music, Brodha V, youtube

This Is One Of The Best Songs I’ve Ever Heard From An Indian Rapper

రికార్డులను తిరగరాస్తున్న పాట..

Posted: 10/08/2014 11:27 AM IST
This is one of the best songs

ఒక్క పాట జీవితాలను మార్చేస్తుందని పెద్దలు చెబుతున్న మాటలు.. నిజమేనని అనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రోద్దా విషయంలో మాత్రం ఇది నిజమేనని రుజువైంది. ఎవరు ఈ బ్రోద్దా అనుకుంటున్నారా..? ఈ పేరు ఎప్పడు వినలేదే అనుకుంటున్నారా..? బహుశా మర్చిపోయి వుంటారులెండి. ఆయన రాప్ మ్యూజిక్ లో దిట్ట. తన పాటతో 2012లో యూట్యూబ్లో సంచలనాలకు తెరతీశారు. అతని పాటను వినాలని యావత్ యువత క్రేజీగా ఎదురుచూశారు. బ్రోద్దా పాటకు వచ్చిన క్లిక్ లతో దేశవ్యాప్తంగా యువతతో పాటు అన్ని వర్గాల సంగీత ప్రియులు విస్మయానికి గురయ్యారు. యూట్యూబ్ లో హిట్స్ చరిత్రను తిరగరాసింది బ్రోద్దా పాడిన పాట. రాప్ మ్యూజిక్ లో క్లాసిక్ సంగీతాన్ని మేళవించి ఆయన అలపించిన పాట వేనోళ్లు శ్లాఘించాయి.

ప్రస్తుతం దేశంలో వున్న ఉత్తమ రాప్ గాయకులలో (రాపర్ల) ఆయన ఒకడుగా స్థానం దక్కించుకున్నాడు. ఆయన పాటను విన్న తరువాత అందరూ ఆయనకు అభిమానులుగా మారుతానడం అతిశయోక్తి కాదు. పైగా ఆయన ఉత్తమ రాపర్ అని కూడా అంగీకరిస్తారు. ఇక మీ మిత్రులు ఎవరైనా మీకు రాప్ హిప్ హాప్ లను వివరిస్తూ ఓ పాటను మెచ్చుకున్న పక్షంలో వారికి.. ఆత్మ రామ, ఆనంద రమణ.. అచ్యుత కేశవ, హరి నారాయణ అనే బ్రోద్దా పాటను బహుమతిగా ఇవ్వండి.. సరిపోతుందన్న సెటర్లు కూడా మనకు వినబడుతుంటాయి. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని బ్రోద్దా అలిగిరి నందిని విశ్వవినోదిని అంటూ కనకదుర్గమ్మను స్మరిస్తూ ఆలపించిన పాట కూడా యూట్యూబ్ లో సంచలనాలకు తెరలేపుతోంది. వారం రోజుల్లోనే ఆయన పాటను 77 వేల మంది వీక్షించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Best Song  Indian Rapper  sony music  Brodha V  youtube  

Other Articles