Flipkart the big billion day sales update

flipkart, flipkart sales, flipkart big billion day, e commerce, online shopping, online shopping offers, shopping offers, latest news, business, mobiles, mobile phone offers, clothes offers, electronics offers

e comerce company flipkart the big billion day sale got huge response by rupees 600 crore rupees worth of orders : flip kart in tension to giver discounts to customers even they are not availing special offers

ఎలా అని తలపట్టుకుంటున్న ఫ్లిప్ కార్ట్...?

Posted: 10/07/2014 03:36 PM IST
Flipkart the big billion day sales update

ఈ-కామర్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు తల పట్టుకుంటుంది. వినియోగదారులకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు. అయితే వస్తుఉత్పత్తి కంపనీల నుంచి ఆఫర్లు తీసుకోకుండా స్వయంగా డిస్కౌంట్లను ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడెలా చేయాలి...? ఏం చేయాలి అని యాజమాన్యం ఒకటే టెన్షన్ పడుతుందట. విషయానికి వస్తే.., ‘ద బిగ్ బిలయన్ డే’ పేరిట ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ప్రకటన చేసింది. సైట్ ద్వారా అమ్ముడయ్యే వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. సోమవారం ఒక్క రోజులోనే ఉదయం ఎనమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మద్య రూ.600కోట్లు విలువ చేసే బిజినెస్ ఆర్డర్లు వచ్చాయి. దేశ ఈ-కామర్స్ వ్యాపారంలోనే ఇదొక సంచలనంగా చెప్పవచ్చు. వాస్తవంగా ఫ్లిప్ కార్ట్ ఊహించిన దానికంటే ఇది ఎక్కువనే చెప్పాలి.

ప్రకటనకు ఆదరణ వచ్చింది. భారీగా ఆర్డర్లు వచ్చాయి.. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే కాస్త ఇబ్బంది ఎదురవుతోంది. భారీ డిస్కౌంట్లను ఎలా ఇవ్వాలా? అని సతమతం అవుతోంది. ఎందుకంటే వివిధ రంగాలకు సంబంధించిన వస్తువులు అమ్మే ఫ్లిప్ కార్ట్ ఆయా ఉత్పత్తులకు సంబంధించి కంపనీల నుంచి డిస్కౌంట్లను పొందుతుంది. వాటి ఆధారంగా వినియోగదారులకు డిస్కౌంట్లను ప్రకటిస్తుంది. అయితే తాజా ఆఫర్ సేల్ కు సంబంధించి కొన్ని కంపనీలతో డిస్కౌంట్లపై ఒప్పందాలు కుదిరాయి. మరికొన్ని కంపనీలతో ఒప్పందాలపై అసలు చర్చ కూడా జరగలేదని తెలుస్తోంది.

ఇలాంటి సందర్బంలో డిస్కౌంట్ ఎలా ఇవ్వాలా అని తీవ్రంగా ఆలోచిస్తోంది. అటు తమకు ముందస్తు సమాచారం లేకుండా తమ ఉత్పత్తులపై ఇంత భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తే ఇప్పుడెలా ఇస్తాము అని ఉత్పత్తి కంపనీలు అంటున్నాయి. తమకు గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారమే తమ ఉత్పత్తులను అందిస్తామని వస్తు ఉత్పత్తి కంపనీలు అంటున్నాయి. అటు ‘ద బిగ్ బిలియన్ డే సేల్’ కు ఇంకా స్పందన వస్తోంది. చాలా ఆర్డర్లు ప్లేస్ అవుతున్నాయి. అటు ఆర్డర్లు.., ఇటు కంపనీల ప్రకటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే డిస్కౌంట్లకు సంబంధించి కంపనీలో చర్చలు జరుపుతున్నట్లు ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం తెలిపింది. వినియోగదారులకు ఇచ్చిన డిస్కౌంట్లపై వెనక్కి వెళ్ళమని స్పష్టం చేసి కస్లమర్లకు ఊరటనిచ్చారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flipkart  the big billion day  e commerce  latest news  

Other Articles