Candidates rush to file nominations on last day in maharastra

BJP, Shiv Sena, alliance ends, Maharashtra, congress, ncp, contestents, independents

Shiv Sena, BJP and NCP Congress to fight Maharashtra polls alone

మహా అసెంబ్లీ సంగ్రామంలో

Posted: 09/27/2014 01:14 PM IST
Candidates rush to file nominations on last day in maharastra

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ఇవాళే చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా తొలిసారిగా మహారాష్ట్ర ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియనుంది. బీజేపి, శివసేన, మహాయుతి పార్టీలతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మధ్య పోత్తలు బెడిసికొట్టడంతో రాజకీయ పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగతున్నాయి. దీంతో అభ్యర్థుల ఖరారుకు రెండో రోజులు వుండడం, చివర క్షణంలో అభ్యర్థులను పార్టీలు ఖరారు చేయడంతో నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు.

మహారాష్ట్రలోని రెండు కూటములు విడిపోవడం.. రాజకీయ నేతలకు కలసి వచ్చింది. బీజేపి, శివసేనల పోత్తు, అటు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మద్య పోత్తుతో ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా అవకాశం కోసం ఎదురు చూసిన నేతలకు.. పోత్తులు బెటిసికోట్టడంతో ఇప్పడు అవకాశం వచ్చింది. దీంతో ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ముందుగా ఆయా నియోజకవర్గాల నుంచి వారి నామినేషన్లను వేసేందుకు సిద్దం అవుతున్నారు.

పార్టీల బి-పామ్ లేకున్నా, పార్టీల నుంచి తమకు హామీలు లేకున్నా.. అధిక సంఖ్యలో ఆశావహులు నామినేషన్ల వేస్తున్నారు. చివరి క్షణంలో పార్టీలు తమకే టిక్కెట్ ను ఇవ్వవచ్చని ఆశిస్తున్న వారితో ప్రతీ నియోజకవర్గంలో 10 నుంచి 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. పార్టీ బీ-ఫాం దక్కని పక్షంలో తాము స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు కూడా వెనుకాడబోమని అభ్యర్థులు తేల్చిచెబుతున్నారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ సారి తాము స్థానం సంపాదించాలన్న యోచనతో అనేక మంది స్వతంత్రులుగా కూడా బరిలో నిలుస్తున్నారు.

అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం కోసం అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముందుగానే పార్టీల వారీగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే సమయాన్ని తెలుసుకుంటున్న అధికారులు .. వారికి వైరి పార్టీ ఎమ్మెల్యేలు ఎదురైన సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీలూ వేటికవే విడివిడిగా పోటీ చేస్తుండంతో ఈసారి మహా ఎన్నికల సంగ్రామం ఎలా ఉంటుందోనన్న ఆసక్తిగా అందరిలోనూ నెలకొంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Shiv Sena  alliance ends  Maharashtra  congress  ncp  

Other Articles