Pm narendra modi left to us on five day visit

Narendra Modi, America tour, The red carpet, Washington, White House, UN, New York, PM,. business tycoons

pm narendra modi left to US on Five day visit

శతకోటిమంది భారతీయుల ఆకాంక్షలతో.. అగ్రరాజ్యానికి..

Posted: 09/25/2014 05:34 PM IST
Pm narendra modi left to us on five day visit

శతకోటి మంది భారతీయ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నేరవేర్చందుకు నడుం బిగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఐదురోజుల ఉన్నతస్థాయి అమెరికా పర్యటన కోసం ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. అగ్రరాజ్యం వినతి, ఆహ్వానం మేరకు అమెరికాకు తొలిసారిగా చేపట్టిన ఈ పర్యటనలో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపనున్నారు. అధికారులు, వ్యాపారవేత్తలు, ప్రజలతో సమావేశాలు మొదలు ఈ నెల 26న ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగం, అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ద్వైపాక్షిక చర్చలతో బిజీబిజీగా ఆయన షెడ్యూల్ సాగనుంది. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ధైపాక్షిక సంబంధాలతో పాటు గణనీయమైన ఫలితాలు వస్తాయని కూడా భారత్ భావిస్తున్నది.

rఅమెరికా పర్యటనలో ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం హిందీలో ప్రసంగించనున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో పాటు పొరుగుదేశాలైన శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే, నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక భేటీలు జరుపనున్నారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆయన సమావేశమయ్యే అవకాశం లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ.ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ తరువాత అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాతో దైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఒబామాతో పాటు పలువరు ప్రజాప్రతినిధులు, కంపెనీల సీఈఓలు, వ్యాపార వేత్తలు కూడా ప్రధానితో భేటీ కానున్నారు.

దుర్గామాత శరన్నవవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఉపవాస దీక్షను ఈ సారి కూడా కోనసాగిస్తున్నారు. మోడీ ఉపవాస దీక్షలో ఉండటంతో అందుకు తగ్గట్టు ఆహార ఏర్పాట్లను చేయాల్సిందిగా అమెరికాను భారత్ కోరింది. దీనికి అమెరికా స్పందిస్తూ.. తమ దేశ పర్యటనకు వచ్చే అతిథుల ఆచార వ్యవహారాలు గౌరవిస్తామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఈ నెల 29న వైట్ హౌజ్ లో అధ్యక్షుడు ఒబామా ఇచ్చే విందులో మోడీకి ఏం అందించనున్నారనే విషయానలు మాత్రం అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు.

గూగుల్, బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్ వంటి సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తం 100 గంటలు అమెరికాలో ఉండనున్న మోడీ ఈ నెల 26న న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో అడుగుపెట్టింది మొదలు 30న వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ ఎయిర్‌బేస్ నుంచి తిరిగి బయలుదేరేవరకు మొత్తం 50 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఫార్చూన్ 500 జాబితాలో చోటు సంపాదించిన పలువురు అమెరికా సీఈవోలతో సమావేశం, దాదాపు 30వేల మంది భారతీయ అమెరికన్లతో భేటీ, వారినుద్దేశించి ప్రసంగించడం ఆయన షెడ్యూల్‌లో భాగంగా ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ద్వైపాక్షిక చర్చల సమయంలో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఐఎస్‌పై పోరాటానికి మోడీ మద్దతును ఒబామా కోరే అవకాశముంది. అయితే దీనిపై సమాచారం వెల్లడించడానికి శ్వేతసౌధం నిరాకరించింది. దీనిపై ఇరు దేశాల అధికారులు మౌనం వహిస్తున్నారు. ఇప్పటికే ఐఎస్ వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ కూటమిలోకి 40 దేశాలు చేరాయి. మరోవైపు మోడీ అమెరికా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల పటిష్ఠతకు సువర్ణావకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టాలూలు, మోడీ పీఎం అంటూ నెంబర్ ప్లేట్లు..
మోడీ పర్యటనను ఇరు దేశాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. 28వ మాడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే కార్యక్రమంలో మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు చిన్న, పెద్ద సహా వేలాది మంది ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నట్లు సమాచారం. వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు 85-90ఏళ్లలోపు వారు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. మోడీ అభిమానులంతా ఆయన రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చేతులపై బీజేపి పార్టీ గుర్తు కమలం టాటూలను వేయించుకుంటున్నారు. తమ కార్ల నంబర్‌ప్లేట్లపై మోడీ పీఎం అంటూ రాసేసుకుంటున్నారు. భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో ఈ ఉత్సాహకర వాతావరణం కనిపిస్తోంది

 జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  America tour  The red carpet  Washington  White House  UN  New York  PM  . business tycoons  

Other Articles