Modi will not eat in america

narendra modi, modi, narendra modi tour, indian prime minister, prime minister of india, officers, modi us tour, modi us tour schedule, white house, obama, blair house, washington, dinner, formal dinner, latest news

prime minister narendra modi america tour schedule fixed but modi is going one day before only : fans of modi in dilemma that modi will continue his fasting in us tour also or breaks for obama

అమెరికాలో మెతుకు ముట్టనని మోడీ ప్రకటన

Posted: 09/23/2014 11:27 AM IST
Modi will not eat in america

నరేంద్ర మోడి.. సంచలనాల ప్రధానిగా అందరికి సుపరిచితుడు. భారతీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మోడి.., ఈ వారంలో అమెరికాకు వెళ్తున్నాడు. అక్కడా మోడీకోసం ఒబామా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. దేశం ఏరికోరి ఎన్నుకున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు అమెరికా సిద్దమయింది. అటు గత పదేళ్లలో ఎవ్వరికి ఇవ్వని విధంగా అమెరికా విందు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. 190ఏళ్ళ చరిత్ర గల బ్లెయిర్ హౌజ్ లో భారీ విందు ఇచ్చేందుకు ఇప్పటికే వంట మనుషుల్ని మాట్లాడి పెట్టారట. అయితే తెల్ల జాతీయుల నల్ల అధ్యక్షుడిని నిరుత్సాహ పరిచేలా ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. అమెరికాలో మోడి మెతుకు ముట్టుకోడని.. కేవలం నీళ్ళు తాగి తృప్తి చెందుతాడని ప్రకటించింది.

హిందూ ధార్మికతకు ప్రాధాన్యత ఇచ్చే నరేంద్రమోడి స్వతహాగా దుర్గామాత భక్తుడు. ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దేవి నవరాత్రి ఉత్సవాల సమయంలో కేవలం నిమ్మరసం మాత్రమే తీసుకుంటారు. అలాంటి పరమభక్తుడు.., ఆనవాయితీని కొనసాగిస్తారని కొందరు అంటుండగా. విందులో పాల్గొన్నా నిమ్మరసం తాగటం వరకు పరిమితం అవుతారు అని మెజార్టీ అభిమానులు అభిప్రాయం చెప్పారు. ఇక మిగిలిన కొంతమంది.. ఈ సారికి కానిచ్చేస్తాడు.., తప్పదు కదా అమెరికా మరికొందరు అన్నారు. ఈ నేపథ్యంలోనే మోడి ఆహార వివరాలపై ప్రకటన విడుదల అయింది. కేవలం మంచినీళ్లు, టీ. నిమ్మరసం తప్ప ఇంకేమి తీసుకోరని అధికారులు తెలిపారు.

ఉపవాస దీక్షల సమయంలో దేశం విడిచి బయటకు వెళ్లని మోడీ తొలిసారి.., అమెరికాకు దీక్ష సమయంలో వెళ్తున్నారు. 25న అమెరికాకు వెళ్తున్న నరేంద్రమోడీ.., ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. పలువురు విదేశీ ప్రధానులు, ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. పర్యటనలో భాగంగా ఒబామాను కలిసి ఇరుదేశాల సన్నిహిత సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. అంతేకాకుండా వాషింగ్టన్ లోని మహాత్ముడి విగ్రహానికి నివాళి అర్పిస్తారని అధికారులు తెలిపారు. అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, 9/11 మృతుల స్మారకాలను సందర్శించి నివాళులు అర్పిస్తారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  us tour  fasting  latest news  

Other Articles