Women not interested in marrying nri men

marriage, indian marriages, indian culture, marriage decaration, marriage stage, reception event, marriage procedure, matches, hindu matches, matrimony, bharat matrimony, shaadi.com, latest news, nri matches, nri jobs, jobs in abroad, indian girls, survey

a survey observed that unmarried women of india not iterested in marrying nri persons : women caring about their protection and living culture, also cares about relationship so they don't prefers nri matches

అబ్బే... ఫారిన్ సంబంధమా? అంటున్నారు అమ్మాయిలు

Posted: 09/18/2014 10:25 AM IST
Women not interested in marrying nri men

ఒకప్పుడు ఎన్నారై సంబంధమంటే ఎగిరిపడ్డ అమ్మాయిలు., ఇప్పుడు ఫారిన్ అంటే పక్కనబెడుతున్నారు. ఇక్కడ ఉండే వారిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది ఏదో తమాషాగా చెప్తున్న మాటలు కాదు.., ఓ సంస్థ సర్వే చేసి మరి నిజాలను వెలికి తీసింది. జీవితంలో కీలకమైన పెళ్లి పట్ల అమ్మాయిలు ఒకప్పటిలా ఆలోచించటం లేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పెద్దలు ఎలా చెప్తే అలా కాకుండా.., తమకంటూ అభిప్రాయాలను, ఆకాంక్షలను ఏర్పర్చుకుని అందుకు తగ్గట్లుగా వరుడిని ఎంపిక చేసుకుంటున్నారు. డబ్బు కంటే తమను ఎక్కువ ప్రేమగా చూసుకునే వారు అయితే బాగుంటుంది అని ప్రస్తుతం అమ్మాయిలు భావిస్తున్నట్లు ఓ పోర్టల్ నిర్వహించిన సర్వేలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుత కాలంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వారికి డబ్బు ఇప్పుడు అంత అవసరం కాదు. డబ్బుకంటే విలువైన ప్రేమ, అనురాగాలను కోరుకుంటున్నారు. ఫారిన్ సంబంధం అయితే పెళ్ళి అయి అక్కడకు వెళితే భర్తతో పాటు ఉద్యోగం చేయాలి.. లేదా భర్త ఒక్కడే ఉద్యోగం చేస్తే.., అతడు ఆఫీసుకు వెళ్ళి వచ్చే వరకూ ఒంటరిగా ఇంట్లో ఉండాలి. సాయంత్రం వచ్చే భర్త మాట్లాడుకోవటానికి కూడా వీలు లేనంతగా అలిసిపోయి పడకగదికి పరిమితం అవుతాడు. అంతేకాకుండా ఫారిన్ లో అయితే మన అనుకునే వారు తక్కువగా ఉంటారు. ఇద్దరే జీవితాంతం ఉండాల్సిన పరిస్థితి. దీన్ని ఈ తరం అమ్మాయిలు కోరుకోవటం లేదని సర్వే చెప్తోంది.

ఇక భారతదేశాన్ని గౌరవించలేని, ప్రేమించలేని వారిని కూడా తాము కోరుకోమని స్పష్టంగా చెప్తున్నారట. భారతీయ విలువలు, సంప్రదాయాలను వ్యతిరేకించే ఎన్నారై అబ్బాయిల్ని 51.7 శాతం నిర్మొహమాటంగా తిరస్కరించారని సర్వే వెల్లడించింది. అంతేకాదు విదేశాలకు వెళ్లి అక్కడి కల్చర్ అలవాటు చేసుకున్న వారినీ 66.7 శాతం మంది యువతులు తిరస్కరించారట. అటు కొద్దికాలంగా భార్యలపై దాడులు చేస్తున్న ఎన్నారైల సంఖ్య పెరగటం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్తున్నారు. మహిళలకు దేశ భక్తి పెరగటంతో పాటు వారి జీవితం పట్ల ఏర్పడిన శ్రధ్ద, తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ నిర్ణయాలకు కారణం అవుతున్నాయని సర్వే చెప్తోంది. సో ఎన్నారై అబ్బాయిలూ.. భారత అమ్మాయిలు కావాలంటే ఇక్కడకు రావాల్సిందే. లేకపోతే ఎన్నారై బ్యాచిలర్ గా ఉండాల్సిందే. జాగ్రత్తగా డిసైడ్ చేస్కోండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marriage  nri matches  indian women  latest news  

Other Articles