Cag ex chief alleges manmohan knows about 2g

2g, CAG, VInod Rai, manmohan singh, former prime minister, A.Raja, central ministers

CAG Ex chief alleges manmohan knows about 2G scam earlier, but not taken steps to stop it.

రగులుతూనే వున్న 2జీ చిచ్చు..మాజీ ప్రధాని టార్గెట్ గా బిగిస్తున్న ఉచ్చు

Posted: 09/12/2014 03:34 PM IST
Cag ex chief alleges manmohan knows about 2g

2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం చిచ్చు ఇంకా రగులుతూనే వుంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం దిగిపోయినా.. మాజీ ప్రధాని మన్మోహన్ చుట్టూ వివాదాలు చెలరేగుతూనే వున్నాయి. స్వయంగా 2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా అంతా ప్రధానికి తెలిసే జరిగిందని కోర్టులో వాంగ్మూలం ఇవ్వగా.. తాజాగా మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ కూడా అంతా ప్రధానికి తెలిసే జరిగిందని వ్యాఖ్యానించారు. 2జీ కుంభకోణం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ముందే తెలుసునని స్కామ్‌ను ఆపే అవకాశం ఉన్నా మన్మోహన్‌సింగ్ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
 
కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మరో సంచలన విషయం బయట పెట్టారు. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1.76 కోట్లు చిల్లు పెట్టిన 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణం తనకు తెలియదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పడం పచ్చి అబద్దమన్నారు. ఈ కుంభకోణం గురించి ఆయనకు ముందుగానే తెలుసని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
 
అప్పటి కేబినెట్‌ మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీ, కమల్‌నాధ్‌ టూజీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని హెచ్చరించినా, మన్మోహన్‌ సింగ్‌ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కమల్‌నాథ్‌ అయితే ఈ విషయంలో లేఖల ద్వారా పదే పదే హెచ్చరిచారని వినోద్‌ రాయ్‌ వెల్లడించారు. గట్టిగా వ్యవహరించి ఉంటే అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన అడ్డగోలు టూజీ స్పెక్ట్రం కేటాయింపులను మన్మోహన్‌ సింగ్‌ ఆపగలిగేవారన్నారు. సంకీర్ణంలో నడుస్తున్న తన ప్రభుత్వాన్నికి ఎలాంటి విఘాతం కలగకూడదన్న ఒకే అంశంపై మన్మోహన్ సింగ్ 2జీ కుంభకోణాన్ని విషయంలో నిశ్చేష్టులుగా వున్నారని వినోద్ రాయ్ అన్నారు.
 
టూజీ, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాల్లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు లేకుండా చూడాలని కాంగ్రె స్‌ నేతలు సంజయ్‌ నిరుపం, సందీప్‌ దీక్షిత్‌, అశ్వనీ కుమార్‌ తనపై ఒత్తిడి తెచ్చారని కూడా వినోద్ రాయ్ వెల్లడించారు. అయితే కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపం ఈ ఆరోపణలను ఖండించారు. రాయ్‌ ఆరోపణలు పచ్చి అబద్దమన్నారు. తానెపుడూ రాయ్‌ని కలవ లేదన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2g  CAG  VInod Rai  manmohan singh  A.Raja  

Other Articles