Heroines in rescue homes

heroines, prostitution, rescue homes, hyderabad, tollywood, gujarat actress

heroines caught doing prostitution, leading life in rescue homes

నాలుగు గోడల మధ్య అందాల బామలు..

Posted: 09/12/2014 01:44 PM IST
Heroines in rescue homes

ఎన్నో కొత్త ఆలోచనలు, కొంగ్రోత్త వ్యూహాలతో సినీ వినీలాకాశంలోకి అడుగుపెడుతున్న టాలీవుడ్ భామలను కష్టాలు వెన్నాడుతున్నాయ్. టాప్ హీరోయిన్ గా వెండితెరపై వెలగాలని కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బామలు.. రెస్క్యూ హోంలలో సేదతీరాల్సిన అవసరాలు వచ్చి పడుతున్నాయ్. సిల్వర్ స్ర్కీన్ పై తమ టాలెంట్ ను ప్రదర్శించాల్సిన బామలు.. నాలుగు గోడల మధ్య అందాల ప్రదర్శనతో బుక్ అవుతున్నారు. సినిమా నటీమణులు వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. వీరిలో టాలీవుడ్, బాలీవుడ్, అని సంబంధం లేకుండా వివిధ ప్రాంతీయ తెరలను ఏలిన బామలతో పాటు వర్థమాన బామలు కూడా వున్నారు.

దేశవ్యాప్తంగా పలు బాషా చిత్రాలకు చెందిన నటీమణులు వ్యభిచారానికి పాల్పడుతూ చిక్కడంపై ప్రేక్షకులు చీదరించుకుంటున్నారు. టాలీవుడ్ వర్థమాన హీరోయిన్లు హైదరాబాద్, విశాఖపట్నంలోనే కాకుండా అనేక ఇతర ప్రాంతాలలో గుట్టుగా తమ పనికానిస్తున్నారు. మొన్న తన తొలిచిత్రంతోనే తెలుగు చిత్రసీమను ఉర్రూతలూగించిన ఓ వర్థమాన నటి.. తాజాగా తోలి చిత్రం బీటెక్ బాబుతో చిత్రసీమకు పరిచమై.. బస్ స్టాప్ సినిమాతో ఫేమ్లోకి వచ్చిన నటి.. ఇలా ఒక్కొక్కరుగా వెలుగోకి వస్తున్నారు. వీరే కాదు హైదరాబాద్ ను అడ్డాగా చేసుకుని ఇతర బాష హీరోయిన్లు కూడా వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ఇందుకు ఇటీవల వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యండెండ్ గా పోలీసులకు పట్టుబడిన ఓ గుజరాతీ నటి ఉదాహరణగా నిలుస్తున్నారు.  గుజరాతీలో పలు సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించిన అహ్మదాబాద్‌కు చెందినదిగా గుర్తించారు.

ప్రఖ్యాతి గాంచిన హీరోయిన్లే వ్యభిచారం చేస్తూ.. చిక్కడం.. జానియర్ ఆర్టిస్టులకి, బుల్లితెర బామలకు అవకాశాన్ని ఇస్తుంది. హీరోయిన్లే తమకు అదర్శమని భావిస్తున్న వీరు.. వారి బాటలోనే పయనిస్తున్నారు. పోలీసుల దాడుల్లో హీరోయిన్లు చిక్కడా లేనిది.. తాము చిక్కితే ఏమవుతుందన్న ధోరణితో సునాయాసంగా.. ధనార్జనకు పాకులాడుతున్నారు. వ్యభిచారం చేస్తూ హీరోయిన్లు చిక్కితే న్యూస్ అవుతుండగా, జూనియర్ ఆర్టిస్టులు, బుల్లితెర బామలు పోలీసులకు చిక్కడం పరిపాటిగా మారింది. హైదరాబాద్ నగరంలోని పంజగుట్ట ప్రాంతంలో పేరొందిన హోటల్ లో యధేశ్చగా జూనియర్ ఆర్టిస్టులు వ్యభిచారం సాగిస్తుంటారని, ఈ హోటల్ కి జూనియర్ అర్టిస్టుల అడ్డాగా పేరువచ్చిందని సమాచారం.

ఈ సంఘటనలు సమాజంపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఇంతకీ సినీమా ఛాన్సులు తగ్గిపోయిన సినిమా నటీమణులు వ్యభిచార కూపంలోకి ఎందుకు దిగుతున్నారు? ఆర్థిక పరిస్థితులు కారణమా? విలాసాలకు అలవాటుపడటమా? వీరిని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? మానసిక దౌర్భల్యమా? నైతిక విలువలు లేకనా? తేలికగా డబ్బు సంపాదించవచ్చని అనుకోవడమా?  ఇదే ఇప్పడు అంతుచిక్కని ప్రశ్న. సినిమాల్లో అవకాశాలున్నంత వరకు చేశాం.. అవకాశాలు కనుమరుగైతే.. అంతే నిజాయితీగా తప్పుకుందామన్న ఆలోచన లేని వారితోనే సామాజిక సమస్య ఉత్పన్నమవతోంది. వ్యభిచారం చట్టవ్యతిరేకం అని తెలిసి కూడా ఇంత మంది ప్రముఖులు ఈ రొంపిలోకి ఎందుకు దిగుతున్నారో.. వారు ఎలా సామాజానికి బదులిస్తారో వారే చెప్పాలి.

అవకాశాలు తగ్గిపోతే బతకడానికి మరో మార్గంలేదా? ఈ వృత్తిలోకే దిగాలా? విలువలకు కట్టుబడి చట్టబద్దమైన మార్గంలో అనేక పనులు చేసుకొని బతకవచ్చు. ఆ మార్గాలను ఎందుకు ఆలోచించరు? సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో వ్యాపారాలు పెట్టుకుని బతుకుతున్న వారేందరు లేరు.  సెలబ్రిటీగా పలువురితో పరిచయాలు ఉండి కూడా ఇటువంటి చట్టవ్యతిరేకమైన వ్యభిచార వృత్తిలోకి దిగడం ఎందుకు? అని ఆలోచన వీరికి ఎందుకు రావడం లేదు? బతకడానికి ఇతర చట్టబద్దమైన మార్గాలను ఎందుకు ఎన్నుకోరు? సాధారణంగా ఇటువంటి సందర్భాలలో పట్టుబడిన ఆ నటీమణులపై కొందరు జాలి చూపుతారు. ఇంత చిన్న నేరానికే ఇంత ప్రచారమా? అని అంటుంటారు.  మరి కొందరు తిట్టిపోస్తారు.  బతకడానికి ఈ పనే దొరికిందా? అని ప్రశ్నిస్తుంటారు. మరికొందరు ఆ విటుల గురించి ప్రశ్నిస్తుంటారు.

దేశంలో యువతులు, సినీ ప్రముఖులు వ్యభిచార కూపంలోకి దిగడానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులే కారణం. యువతులు పొట్టకూటి కోసం వ్యభిచార ఊబిలోకి దిగుతుండగా, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన సినీమా హీరోయిన్లు వాటిని కొనసాగించేందుకు ఈ రోంపిలోకి దిగుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్వచ్ఛంద సంస్థలు, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రభుత్వం వీరికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సివుంది. నిర్భాగ్య యువతుల కోసం మహిళా సంక్షేమ శాఖ ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక పథకాలను రూపొందించవలసిన అవరసం ఉంది. వ్యభిచారం ఎక్కువగా జరిగే ప్రాంతాలలో  పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heroines  prostitution  rescue homes  tollywood  

Other Articles