Child marriage is worse than rape

child marriages, child marriage in india, rape, gang rape, blind beliefs, woman protection, bribe, dowry cases, divorce, court, delhi court, supreme court, woman harassment, child harassment, child rights

delhi court says child marriage is worse than rape : child marriage is more dangerous when it compares to a rape says delhi court

ఆ పెళ్ళి రేప్ కంటే దారుణమైనది - కోర్టు

Posted: 09/07/2014 11:35 AM IST
Child marriage is worse than rape

దేశంలో వివాహ వ్యవస్థపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాల్య వివాహాలపై ఘాటుగా స్పందించింది. బాల్య వివాహాలు అత్యాచారాల కంటే దారుణమైనవిగా కోర్టు అభిప్రాయపడింది. బాల్యవివాహాల వల్ల చిన్నారులు, మైనర్ బాలికలు అనుభవించే కష్టాలు.., వయస్సతో పాటు వారికి పెరిగే కష్టాలను వర్ణించలేమని ఆవేదన వ్యక్తం చేసింది. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని సూచించింది.

తన బాల్య వివాహ కష్టాలపై ఓ బాలిక ఫిర్యాదుపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 14ఏళ్ళ ఓ బాలకకు తల్లితండ్రులు పెళ్ళి చేశారు. అయితే  భర్త, అత్తవారింటివారు కట్నం కోసం ఆ అమ్మాయిని వేధించటం మొదలుపెట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు, అమ్మాయి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్బంగా కట్నం ఇవ్వటం, తీసుకోవటం నేరమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అంతేకాదు బాల్య వివాహాలు కూడా చట్టరిత్యా నేరం, సామాజిక దుష్పరిణామం అని కోర్టు అభిప్రాయపడింది. సమాజంలో సతీసహగమనం, భర్త చనిపోతే అలాగే ఉండిపోవాలన్న ఆచారాలు చాలావరకు తొలగాయి. కాని బాల్య వివాహాలు ఇంకా కొన్నిచోట్ల జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా పరికప్వం చెందని వయస్సులో పెళ్ళిళ్ళు చేయటం వల్ల శారీరక సమస్యలు రావటంతో పాటు, మానసికంగా కూడా వారు కుంగిపోతారని సర్వేలు చెప్తున్నాయి. అయినా సరే ఈ దురాచారాలు ఆగటం లేదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : child marriage  rape  delhi court  latest news  

Other Articles