Police dog rakhi helps to reveal a rape case in kukatpally

police dog, police dog rakhi, hyderabad police dog rakhi, kukatpally rape case, rape accused raju arrested, police dog rakhi rape case, hyderabad kukatpally

police dog rakhi helps to reveal a rape case in kukatpally

‘‘రాఖీ’’ చేసిన సాహసానికి పోలీసులే అవాక్కయ్యారు!

Posted: 09/01/2014 01:43 PM IST
Police dog rakhi helps to reveal a rape case in kukatpally

(Image source from: police dog rakhi helps to reveal a rape case in kukatpally)

ఇతరులను ముచ్చెమటలు పెట్టించే పోలీసులకు ఎవరైనా షాక్ కు గురిచేస్తారా..? అది అంత సామాన్యమైన విషయం కాదులెండి! అయితే ఇక్కడ ‘‘రాఖీ’’ మాత్రం మొత్తం పోలీస్ శాఖనే షాక్ కు గురిచేసింది. అది చేసిన సాహసానికి అందరూ మెచ్చుకున్నారు. అయితే ఇక్కడ రాఖీ అంటే బాలీవుడ్ లో ఏ రాఖీసావంతో, లేదా ఇతర ఐటం గర్లో అనుకోకండి.. రాఖీ అందే ఒక కుక్క! పోలీసుల శిక్షణలో రాటుతేలిన రాఖీ.. ఇప్పుడా పోలీసులకే నిందితులను ఎలా పట్టుకోవాలో పాఠాలు నేర్పుతోందని ఒక్కటే వార్తలు! ఇంతకీ అది చేసిన సాహసం ఏంటని అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే!

కూకట్ పల్లికి చెందిన రాజు అనే వ్యక్తి చిత్తకాగితాలు, ఇనుపసామాన్లను అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఒక మహిళలను తీసుకొచ్చిన అతను.. కూకట్ పల్లిలోని ఒక బస్ స్టాప్ దగ్గర తన మిత్రులతో కలిసి ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆదివారం ఉదయం శవాన్ని చూసిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందిచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఈ కేసు కొంచెం చిక్కుముడిగా వుంటుందని భావించి, తమతోపాటు రాఖీను కూడా తీసుకొచ్చారు. ఆ రాఖీని ఘటనాస్థలం దగ్గర వదిలారు.

ఆ ప్రాంతాన్ని నిశితంగా గమనించిన రాఖీ.. కొంతదూరం వరకు వెళ్లి రాజును పట్టుకుంది. దాంతో రాజు కూడా దొరికిపోయానేమోనని భయపడిపోయాడు. దీంతో అనుమానాస్పదంగా వున్న రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను అసలు విషయాన్ని వెల్లడించాడు. ఏ ఆధారాలు లేకుండానే కేసును విచారించడం చాలా చిక్కుముడిగా భావించిన పోలీసులకు.. రాఖీ సింగిల్ గా హ్యాండిల్ చేసి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడంలో చేసిన సాహసానికి వాళ్లంతా అవాక్కైపోయారు. ఇది చేసిన ఈ పనిని మెచ్చుకున్న సదరు ప్రముఖులు.. పోలీసుల కంటే రాఖీయే మేలని దానిని కొనియాడారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police dog  rakhi police dog  kukatpally rape case  

Other Articles