Impotence test shoold done before marriage

impotence test, potency test, sexual harmons, lie detector tests, scaning, pregnant, cases, divorce, marriage, sexual life, husband and wife, latest news, family courts, lawyar, madras high court

madras court asked central government why should make a dicission to impotence test before marriage : madras high court sasy impotence test before marriage should made as must to avoid divorce

మగాడా? కాదా? పెళ్ళికి ముందే తెలియాలి !!

Posted: 08/30/2014 09:21 AM IST
Impotence test shoold done before marriage

మగాళ్లకు కష్టకాలమే వచ్చింది. తమను తాము పెళ్ళికి ముందే నిరూపించుకోవాల్సిన సమయం ఏర్పడింది. నువ్వు మగాడివేనా అని సరదాకు అంటేనే ఏ మగాడూ సహించడు. అలాంటిది నువ్వు మగాడివేనా నాకు ఆధారాలతో నిరూపించాలి అంటే ఇంకేమైనా ఉందా? కాని ఇప్పుడు నిరూపించుకోక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెళ్ళికి ముందే మగాడా? కాదా? తెలుసుకునేలా నిబంధన తేవాలని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు ఇలాంటి నిబంధన ఎందుకు తీసుకురాకూడదో చెప్పాలని కేంద్రానికి హైకోర్టు మధురై బెంచ్ నోటిసులు కూడా పంపింది.

ఓ కేసుపై విచారణ సందర్బంగా మద్రాస్ హైకోర్టు ఇంపొటెన్సి పరీక్షల అవసరాన్ని వివరించింది. ఎంఎస్సీ (ఐటి) చేసిన ఓ అమ్మాయికి గత సంవత్సరం పెళ్ళయింది. ఆ తర్వాత తన భర్త నపుంసకుడని తెలుసుకుంది. మగాడు కాని మొగుడితో తాననుండలేననీ వెంటనే తనకు విడాకులు ఇప్పించాలని కోర్టుకెక్కింది. ఆమె బాధను విన్న న్యాయమూర్తి జస్టిస్. కిరుబాకరన్ చలించిపోయారు. ఇలా నపుంసకత్వం కారణంగా వివాహబంధం విఫలమవకుండా ఉండాలంటే పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు నిర్వహించటం తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ అవసరం ఉందా?లేదా? అని ప్రశ్నించారు. నపుంసకత్వం కారణంగా చాలా కుటుంబాలు విడాకులు కోరుతున్నట్లు ఈ మద్య నమోదవుతున్న కేసులే చెప్తున్నాయని వెల్లడించారు.

ఇలా నపుంసకత్వం కారణంగా దాంపత్య జీవితం ఆగిపోకుండా ఉండాలంటే.., పెళ్లికి ముందుగానే లైంగిక సామర్య్ధ పరీక్ష నిర్వహించటం మంచిదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇలాంటి కేసుల్లో విడాకులు ఇచ్చేందుకు ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఈ కేసులు పరిష్కరించేలా చట్ట సవరణలు కూడా ఎందుకు చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక తనలో విషయం లేదన్న సంగతి పెళ్లి సమయంలో దాచిపెట్టి మోసం చేసిన వారి నుంచి పరిహారం ఇప్పించటంతో పాటు, వారికి శిక్షలు కూడా ఎందుకు విధించకూడదన్నారు. చాలా తీవ్రమైన ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్రాన్ని మద్రాస్ హైకోర్టు జడ్జి ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.

ఇప్పటికే దేశంలో ఆడ, మగ మద్య లింగ నిష్పత్తి తేడా ఏర్పడి.., ఆడవారికి డిమాండ్ ఏర్పడింది. వరకట్నం అడిగే అబ్బాయిలు ఇప్పుడు కట్నం పక్కనబెట్టండి కావాలంటే మేమే ఎదురు కట్నం ఇస్తామని అంటున్నారు. అలాంటిది ఇప్పుడు పెళ్ళికి ముందే పరీక్షలంటే.., పాపం మగాళ్ళకు ఎన్ని కష్టాలు. మగాడిగా పుట్టడమంటేనే పరిక్షలు ఎదుర్కోవటమా అని ప్రశ్నించుకుంటున్నారు మగ మహారాజులు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : impotence test  madras courts  divorce  marriage  

Other Articles