Ap cm chandrababu naidu clarification on capital

chandrababu naidu, chandrababu naidu press meet, chandrababu naidu capital city, ap capital city, ap capital news, chandrababu naidu shiva rama krishna committee, ap capital shiva ramakrishnan committee

ap cm chandrababu naidu clarification on capital : ap cm chandrababu naidu clarifies about capital city of state on his latest interview

బాబూ.. ఏపీ రాజధాని ఎక్కడో తెలుసా?

Posted: 08/21/2014 03:00 PM IST
Ap cm chandrababu naidu clarification on capital

విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న సమస్యలు ఎంత తీవ్రతరమయ్యాయో అందరికీ తెలిసిందే! తెలంగాణ విషయం పక్కనపెడితే.. ఆంధ్రరాష్ట్రానికి కష్టాలు రానురాను మరిన్ని ఎక్కువవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇంతవరకు అక్కడ ఏపీ రాజధాని ఎక్కడ నిర్ణయించాలోనన్న విషయం మీద స్పష్టత రాలేదు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఎయిర్ పోర్టులు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, కొత్తకొత్త పథకాలు, సింగపూర్ ను మించిన రాజధాని అంటూ ఎన్నో రకాల వ్యాఖ్యానాలు చేశారు. ఆ విషయాల మీద ప్రముఖులతో మంతనాలు కూడా జరిపారు. ముఖ్యంగా రాజధాని విషయంపై శివరామకృష్ణ కమిటీ ఇప్పటికే ఏపీ మొత్తం చక్కర్లు కొట్టేసింది. కానీ రాజధాని ఎక్కడన్న విషయాన్ని తేల్చలేకపోతున్నారు. ఒకవైపు కర్నూలును రాజధాని చేయాలంటూ ఆ ప్రాంతవాసులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండగా... మరోవైపు దిక్కుతోచని పరిస్థితిలో కమిటీ సభ్యులు, చంద్రబాబు వుండిపోయారు. రాజధాని ఎప్పుడు, ఎక్కడ నిర్మిస్తారోనంటూ అందరూ ప్రశ్నిస్తున్న తరుణంలో.. తాజాగా ఆయన దానిమీద ఒక విశ్లేషణ ఇచ్చుకున్నారు.

ఏపీ రాజధాని విషయం గురించి తాజా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ చేసిన దిక్కుమాలిన విభజన వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నాం. ఏపీ రాజధాని ఎక్కడనే విషయాన్ని ఇంకా నిర్ణయం కాలేదు’’ అంటూ తేల్చి చెప్పేశారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణాలో వుండే పాత అసెంబ్లీ భవనంలోకి వెళుతుంటే ఎంతో బాధ కలుగుతోందని’’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలకోసం నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘విభజన ఎలాగో జరిగిపోయింది. ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ చేసిన ఈ పనికి ఇప్పుడు అనుభవిస్తుంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేద్దాం. ఈసారి జాగ్రత్తగా పనిచేయకపోతే పార్టీ మళ్లీ కష్టాల్లోకి పడిపోతుంది’’ అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మోడీ ప్రకటించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎంతో అద్భుతంగా వుందని పేర్కొన్న ఆయన.. ఏపీని కూడా ఆ తరహాలోనే డిజిటల్ రాష్ట్రంగా మారుద్దామని నేతలతో అన్నారు.

ఇదిలావుండగా.. ఏపీ రాజధాని విషయంపై ఇంతవరకు టీడీపీ పార్టీ తేల్చకపోవడంతో ఆంధ్రరాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమకు ఒక ప్రత్యేక రాజధాని వస్తుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో.. బాబు ఈవిధంగా వ్యాఖ్యలు చేయడం వారిని మరింత కలచివేసింది. ఇలాగే వాయిదాలు వేసుకుంటూపోతే టీడీపీ అధికారం అయిపోతుందేకానీ.. రాజధాని మాత్రం ఏర్పడదంటూ పలువులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాబూ.. ఏపీ రాజధాని ఎక్కడో ఒక చోట చేసేస్తే.. మా బతుకులు మేం బతుక్కుంటాం’’ అంటూ వాదనలను వినిపిస్తున్నాయి. అయితే ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు నిద్రహారాలు మానేసి చాలా కష్టపడుతున్నారని ఆయన పార్టీకి చెందిన శ్రేణులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap capital city  shiva ramakrishnan committee  ap people  kurnool  

Other Articles