Sakari momoi gif

Sakari Momoi, world oldest man, world oldest woman, tallest man, tallest woman, interesting facts, funny news, scarey news, weird news, world news, latest updates, japan news, gunnies book records

japan man Sakari Momoi become world's oldest man enterd into gunnies records : Sakari Momoi of japan become world oldest man

ప్రపంచంలో పండు, జపాన్లో ఉండు !!

Posted: 08/20/2014 06:02 PM IST
Sakari momoi gif

ప్రస్తుతం మనిషి జీవితం మహా అయితే అరవై ఏళ్ళు, మరీ ఎక్కువైతే ఓ డెబ్బై. అంతకు మించి బతకటం అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజుల్లో. మూడు పదులు మీదపడగానే.., రోగాలన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొని వస్తుంటే.., ఇంక ఎక్కడ బతుకుతాం అనుకుంటున్నారా. అలా ఏం కాదు అంటున్నాడు జపాన్ కు చెందిన మమోయ్. ఇయన వయస్సెంతో తెలుసా జస్ట్ 111ఏళ్ళు మాత్రమే. ఈయన పేరున ఇప్పుడో రికార్డు కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వయస్సున్న వృద్ధుడుగా సకారి మమోయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. 1903 ఫిబ్రవరి 5న పుట్టిన సకారి.., ఈ ఏడాదే 111వ ఏట అడుగుపెట్టాడు. గతంలో అలెగ్జాండర్ (111 సంవత్సరాల 164 రోజులు ) పేరుపై ఉన్న రికార్డును చెరిపేశాడు. దీంతో గిన్నిస్ బుక్ మమోయ్ రికార్డుల్లో చేర్చింది. అవార్డు తీసుకునేందుకు డార్క్ సూట్ వేసుకుని, సిల్వర్ రంగు టై ధరించి చక్రాల కుర్చిలో వచ్చాడు.

సకార్ మమోయ్ ఐదుగురు కొడుకులతో కలిసి టోక్యోలో నివసిస్తున్నాడు. ఇప్పటికి తన పనులు కొన్ని తానే చేసుకోగలనని చెప్తున్నాడు. పుస్తకాలు చదవటం, చైనా కవిత్వం అంటే తనకెంతో ఇష్టమని తెలిపాడు. అటు ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళ రికార్డు కూడా జపాన్ పేరుపైనే ఉంది. 116 సంవత్సరాల ఒకావో ప్రపంచ వృద్ధురాలిగా రికార్డుకెక్కింది. జపనీయులు నిత్యం యోగాను తమ కార్యక్రమాల్లో భాగం చేస్తారు. వారు ఇంట్లో కూర్చుని ఏ పని చేయాలన్నా అది వజ్రాసనంలోనే కూర్చుంటారు. వజ్రం ఎప్పటికి చెక్కు చెదరదన్నట్లు.., అలా యోగా, ఆరోగ్య నియమాలు పాటించటం వల్లనే వీరి ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంది. సో మనమూ యోగా చేద్దాం.., ఆరోగ్యంగా ఉందాం. బీ హెల్తీ.., లీవ్ హెల్తి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakari Momoi  gunnies book  japan  latest updates  

Other Articles