Ap cm chandrababu naidu met with birla halmtech officials

chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu birla company, chandrababu naidu birla cement factory

ap cm chandrababu naidu met with birla halmtech officials : birla halmtech officials are accepted to built a cement factory in andhra pradesh state kurnool town from which 4000 people will get jobs

టాటా బిర్లా.. మధ్యలో ‘‘బాబు’’!

Posted: 08/18/2014 06:37 PM IST
Ap cm chandrababu naidu met with birla halmtech officials

(Image source from: ap cm chandrababu naidu met with birla halmtech officials)

ఇదేదో కొత్త సినిమా టైటిల్ అనుకునేరు... అలా అనుకుంటే మాత్రం మీరు తొందరపడి పప్పులో కాలేసినట్టే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పటివరకు ఎంతోమంది అగ్రస్థాయిలో వున్న ప్రైవేటు కంపెనీ యాజమాన్యాలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా ఈయన బిర్లా హామ్ టెక్ సంస్థ ప్రతినిధులతో కలిశారు. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల మండలం పెట్నికోటలో ఒక కొత్త సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే నేపథ్యంలో బాబు ఇలా వీరితో మంతనాలు జరిపారు.

కొద్దిసేపటివరకు వీరితో సంభాషణలు ముగిసిన అనంతరం వారు సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కర్మాగారం వల్ల దాదాపు 4వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. దీంతో హర్షం వ్యక్తం చేసి బాబు.. ఈ తరహాలో మరిన్ని కర్మాగారాలను ఆంధ్రరాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వారితో మంతనాలు జరిపిన బాబు.. ఆ కంపెనీని ఆంధ్రాలో ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అలాగే ఏకంగా 14 ఎయిర్ పోర్టులను నిర్మించే సన్నాహాలను సీఎం బాబు సిద్ధం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles