Jagan says he dont have one lakh crore money

ys jagan, ys jagan family, ys rajashekar reddy, ys death mystory, ysr, ysr congress, sharmila, brother anil kumar, ys bharati, jagan padayatra, odarpu, jagan case, cbi, jd laxminarayana

jagan denies allegations that he had one lakh crore rupees : if any one proves that i had one lakh crore rupees i will give 90percent of money to them says jagan

నాకు జస్ట్, ఓ పదివేల కోట్లు చాలు !

Posted: 08/18/2014 01:53 PM IST
Jagan says he dont have one lakh crore money

లక్షకోట్ల అవినీతి. ఈ మాట వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ జగన్ పేరు. ఆయన అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది సీబీఐకి, పైవాడికి తెలియాలి. తండ్రి హయాంలో బ్యాక్ డోర్ పనులు, క్విడ్ ప్రో కో ద్వారా జగన్ లక్ష కోట్లను అక్రమంగా కూడబెట్టాడని తీవ్ర ఆరోపణలున్నాయి. ఇదే కేసులో జగన్ అరెస్టయి ఏడాదికంటే ఎక్కవే జైలు జీవితం గడిపి ఎన్నికల ముందు విడుదలయ్యారు. ఇప్పుడిదే అంశం మళ్ళి తెరపైకి వచ్చింది. అటుపోయి ఇటు పోయి తనకే తగిలినట్లుగా.., అన్నిటిపై విమర్శలు వచ్చి చివరకు లక్ష కోట్ల వ్యవహారం దగ్గర నిలిచింది. దీంతో జగన్ కు కోపం వచ్చింది. అసలు ఎక్కడున్నాయి లక్ష కోట్లు అని ఎదురు ప్రశ్నించారు.

మాట్లాడితే లక్ష కోట్లు, అతిపెద్ద అవినీతి అని తనపై విమర్శలు రావటం పట్ల జగన్ మండిపోయారు. తన వద్ద లక్ష కోట్లు ఉన్నాయని అనవసరంగా దుష్ర్పచారం చేస్తున్నారని ద్వజమెత్తారు. నిజంగా తన దగ్గర లక్ష కోట్లు ఉంటే అందులో పది శాతం తనకు ఇచ్చి మిగతాది అంతా నిరూపించిన వారే తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇకపై కూడ తనపై అర్ధంపర్థంలేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జగన్  మాటను ఎవరు సవాల్ గా తీసుకుని లక్ష కోట్లున్నట్లు నిరూపిస్తారో.., ఎవరు తొంబై వేల కోట్ల విజేతలు అవుతారో చూడాలి మరి.. రాజకీయ నేతలా.., సిబిఐ అధికారులా అనేది. చివరకు తనలాంటి జన నేత బతకడానికి ఓ పదివేల కోట్లయితే సరిపోతాయి అంతకు మించి ఎక్కువ కూడా ఆశించటం లేదని జగన్ చెప్పారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  cbi case  latest news  ysrcongress  

Other Articles