Pilot slept in the air co pilot busy with tab

pilot, co pilot, sleeping, flights, mumbai, brasilia, indian airports, indian airlines, air india, dgca, tabs, games, mobile phones, flight accidents, flight crashes, flight journey

pilot sleeps in mumbai brasilia flight co pilot playing games in tab : dgca enquring the issue of pilot sleeping in plane

పైలట్ పడుకుంటే.., కో-పైలట్ ఆడుకుంది !!

Posted: 08/14/2014 10:25 AM IST
Pilot slept in the air co pilot busy with tab

          విమాన ప్రమాదాలు ఈ మద్య ఎక్కువయ్యాయి. నెలకో విమాన ప్రమాదం జరుగుతోంది. వందల మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఇంత జరుగుతుంటే విమానం నడిపే పైలట్లు ఎంతఅప్రమత్తంగా ఉండాలి. విధి నిర్వహణలో ఎంత అలర్ట్ గా మెలగాలి. కాని ఓ పైలట్ విమానంను గాల్లోకి వదిలేసి తాపిగా కునుకుతీశాడు. ఆకాశంలో తేలిపోతూ.., ప్రకృతిని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.ముంబై నుంచి బ్రసెల్స్ వెళ్తున్న విమానంలో మార్గ మద్యలో పైలట్ నిద్రపోయాడు. అయితే చాలాదూరం ప్రయాణించే విమానాలకు పైలట్లు కాసేపు నిద్రపోవచ్చని ఎయిర్ లైన్స్ వర్గాలే చెప్తున్నాయి. అయితే ఆసమయంలో మాత్రం కో పైలట్ అప్రమత్తంగా ఉండాలి. పైలట్ స్థానంలో విధులు నిర్వర్తిస్తూ ఉండాలి. అయితే ఈ విమానంలో కో పైలట్ ట్యాబ్ మాయలో మునిగితేలుతోంది. అక్కడ విమానం గాల్లో పైకి కిందకువెళ్తుంటే... అవేవి పట్టించుకోకుండా తన పనిలో బిజీగా ఉంది.
   
          మరి ఏమైందో తెలియదు కాని విమానం ఉన్నట్టుండి ప్రయాణిస్తున్న ఎత్తునంచి ఏకంగా ఐదువేల అడుగులు కిందకు వచ్చేసింది. అయినా సరే పైలట్ మత్తు వదల్లేదు.., కో పైలట్ ఆట మానలేదు.ఇది జరిగినప్పుడు విమానంలోని ప్రయాణికుల పరిస్థితి చూడాలి. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రార్థనలు మొదలు పెట్టారు వారు. చివరకు విమానంను గమనించిన అంకారా ఏటీసీవెంటనే ప్రమాద హెచ్చరికలు పంపింది. ఎమర్జెన్సి అలారం మోగటంతో మత్తు వదిలిన పైలట్ వెంటనే నిద్రలేచి ఆదరాబాదరాగా విమానంను కంట్రోల్ చేశాడు. ఏటీసీ విమానంను గమనించకపోయినా.., పైలట్వెంటనే లేవకపోయినా ఏం జరిగేదో ఊహించుకుంటేనే వణుకుపుడుతోంది. మనకే ఇలా ఉంటే ఇక ఆ విమానంలోని ప్రయాణికులకు ఎలా ఉంటుందో ఊహించుకోగలము. మొత్తానికి పెను ప్రమాదం త్రుటిలోతప్పినందుకు సంతోషించాలి. టర్కీ గగనతలంలో ఈ ఘటన జరిగింది. ఈ విమానం జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777.
 
         ఈ ఘటనపై జెట్ ఎయిర్ వేస్ చాలా సీరియస్ అయింది. చాలా తీవ్రమైన తప్పిదమని స్పష్టం చేసిన సంస్థ.., విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను గ్రౌండింగ్ చేసి విచారణ జరుపుతోంది. పైలట నిద్రపోతున్నసమయంలో కో పైలట్ విమానంలోని ఎలక్ర్టానిక్ ఫ్లైట్ బ్యాగ్ అనే ట్యాబ్ వాడుతోంది. అందులో విమాన వేగం, దిశ, ప్రయాణిస్తున్న తీరు వంటి విషయాలుంటాయి. అయితే ఆమె ఇవేవి గమనించలేదు. అటు ఈఘటనపై డీజీసీఏ కూడా సీరియస్ అయిది. ఘటనపై పూర్తి విచారణ జరిపి తప్పు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి వారు ఉంటే అప్పుడప్పుడూ ఏంటి ఎప్పుడూ విమాన ప్రమాదాలు జరుగుతాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pilot sleeping  flight accidents  dgca  tabs  

Other Articles