Tomatoes for rich bjp rajya sabha mp says

Tomatoes for rich BJP Rajya sabha MP says, Only rich eat tomatoes MP says, Tomatoes prices swell, tomato prices rise 80 rupees kilo

Tomatoes for rich BJP Rajya sabha MP says in TV interview talking about price rise

టమాటాలున్నది బలిసినోళ్ళు తినటానికేనట

Posted: 07/30/2014 04:32 PM IST
Tomatoes for rich bjp rajya sabha mp says

టమాటాలున్నది బాగా బలిసినవాళ్ళు తినటానికేనంటున్నారు భారతీయ జనతా పార్టీ రాజ్య సభ్ ఎంపీ ప్రభాకర్ ఝా.  

ఆదివారం ఢిల్లీలో టమాటాల ధర ఉన్నట్టుండి పెరిగిపోవటంతో సహజంగానే దాని మీద వివిధ పార్టీల నాయకుల నుంచి వివిధ రకాలుగా వ్యాఖ్యలు వచ్చాయి.  దాని మీద స్పందించిన ప్రభాకర్ ఝా, టమాటాలు తినేది పైసలు బాగా ఉండి బుగ్గలు ఎర్రబారినోళ్ళేనని అనటం అగ్నికి ఆద్యం పోసినట్లైంది.  

ఆ మాట అన్న తర్వాత మిగతా మాటలన్నీ వ్యర్థమే అయిపోతాయి.  తన మాటలుగా కాకుండా ఆ మాటలకు అని అంటారు అని తగిలించారు ఎంపీ మహాశయుడు.  అయినా ధరలను నియంత్రించటానికే చూసామని,  వాతావరణం కాస్తంత ప్రతికూలంగా మారి ధరలు పెరిగినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనక్కర్లేదన్నది ఆయన వాదన.

టమాటాలు కిలో 80 రూపాయలకు పెరిగిన నేపథ్యంలో సామాన్యుడికి ఏం తిని బ్రతకాలో అర్థం కావటంలేదు.

ఫాస్టెస్ట్ టంగ్ ఫస్ట్ అని సమాజ్ వాదీ పార్టీ ముందుగా స్పందిస్తూ, ప్రజలే గుణపాఠం చెప్తారు.  ఏ ప్రజలైతే గద్దెక్కించారో వాళ్ళే దించేస్తారు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles