Google introducing online inverter competition

google latest news, google inveter competition, google online competitions, online competitions on google, laptop size inverter, google introducing inverter competition, google introducing online inverter competition worth 6 crores, google latest news

google introducing online inverter competition worth 6 crores

మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా..?

Posted: 07/28/2014 03:02 PM IST
Google introducing online inverter competition

మీరు కోటీశ్వరులు కావాలనుకుంటన్నారా..? మీరు వున్న చోటు నుంచే కోట్లలో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా..? అటువంటి పట్టుదల వున్నవారికి ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ అయిన ‘‘గూగుల్’’ మీకో సదావకాశాన్ని చేకూరుస్తోంది. అయితే ఈ పోటీలో పాల్గొనడం అంత సాధ్యమైన విషయం కాదు. మేధస్సుతోపాటు సాంకేతిక అంశాల మీద అవగాహనలను కలిగివున్నవారు మాత్రమే దీనికి పూర్తి అర్హులు.

‘‘గూగుల్’’ ప్రవేశపెడుతున్న ఈ పోటీ సారాంశం ప్రకారం... చిన్నసైజులో వుండే ల్యాప్ టాప్ ఆకారంలో ఒక చిన్న ఇన్వర్టర్ ను తయారు చేయాలి. అంతేకాదు బాబోయ్.. ఇందులో కొన్ని సాంకేతిక పరిమితులు కూడా వున్నాయి. అవేమిటంటే.. సదరు ఇన్వర్టర్ సహజ వనరులైన గాలి, సౌరశక్తితో పనిచేసేలా వుండాలి. ఒక కిలోవాట్ విద్యుత్ ను ఉత్పత్తి చేయగల సత్తాను కలిగి వుండాలి. అప్పుడే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హత లభిస్తుంది.

‘‘లిటిల్ బాక్స్ ఛాలెంజ్’’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలో విజయం సాధించిన వారికి సుమారు రూ.6కోట్ల వరకు ధనరాశిని గూగుల్ సమర్పించుకుంటుందని ప్రకటన కూడా ఇచ్చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఇటువంటి ప్రత్యామ్నాయ పద్ధతి ద్వారా ప్రపంచానికి విద్యుత్ శక్తికి సంబంధించిన చాలా సమస్యలు తీరుతాయని, ప్రపంచంలోనే ఇదో గొప్ప మలుపుగా నిలిచిపోతుందని గూగుల్ నిర్వాహకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు.. ప్రపంచంలో వున్న మారుమూల ప్రాంతాలకు కూడా దీనిని సరఫరా చేయవచ్చునని... అతి తక్కువ ఖర్చుతో కూడిన మైక్రోగ్రిడ్ లలా దీని ఏర్పాటు సాధ్యమవుతుందని గూగుల్ భావిస్తోంది. అయితే ఆలస్యమెందుకు..? సాంకేతిక విభాగాల్లో మీకు మీరు మంచి నిపుణులుగా భావించుకునేంటే వెంటనే గూగుల్ లు దరఖాస్తులు పెట్టుకోండి. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ సెప్టెంబర్ 30! ఇందులో విజయం సాధించిన విజేతను 2016 జనవరిలో ప్రకటిస్తారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles