Millionaire beggar nabbed in saudi arabia

Millionaire Beggar saudi, Nabbed Saudi Arabia, beggar nabbed in Saudi Arabia, Millions Owns Beggar,

Police in Saudi Arabia have arrested a beggar, who, it later turned out, has been sitting on a fortune of over $300,000, a media report, Millions Owns A Beggar Caught In Saudi Arabia

భార్య-పిల్లలు ఒక కోటీశ్వరుడు బిక్షాటనం స్టారీ!

Posted: 07/24/2014 01:44 PM IST
Millionaire beggar nabbed in saudi arabia

సహజంగా బిచ్చగాళ్లు నడిచే వెళ్లి అడుక్కోటం మనం నిత్యం చూస్తుంటాం. బిచ్చగాడి పై చాలా వాడుక పదాలు వాడుతుంటాం. ‘‘నేనేమైన బిచ్చగాడిని, కొత్త బిచ్చగాడు పొదెరగడు, బిచ్చగాడిలా ప్రవర్తిస్తున్నాడు’’ ఇలా కొన్ని పదాలు సందర్భాన్ని బట్టి మనం వాడుతుంటాం. మనదేశంలో బిచ్చగాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న మన ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎందుకంటే.. వారికి ఓట్లు ఉండవు కాబట్టి. కానీ సౌదీ అరేబియాలో అలా కాదు.. బిచ్చగాడు కనిపిస్తే చాలు జైలు శిక్షే. 


సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఓ 40ఏళ్ల వ్యక్తి భిక్షాటన చేస్తుండగా పోలీసులకు కంటపడ్డాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతగాడి వద్ద కోట్ల రూపాయలు ఉన్నట్టు తేలింది. అతడితో పాటు భార్య, ముగ్గురు పిల్లలు కూడా నిత్యం భిక్షాటన చేస్తారని వెల్లడైంది. ఇప్పుడు అతగాడితో పాటు అతడి భార్య, పిల్లలు కూడా కటకటాలపాలయ్యారు.

సౌదీలో బిక్షాటనం నిషేదం. అక్కడ ఎవరైన భిక్షాటన చేస్తే.. జైలుకు వెళ్లాల్సిందే. అయితే ఈ బిక్షగాడు మాత్రం రోజు భిక్షాటన కోసం వీళ్లు వివిధ పట్టణాలకు కార్లలో తిరుగుతారట! పైగా.. లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారట! అడుక్కొని బతికితే తప్పేముందంటారా..?! అయితే స్థానిక చట్టాల ప్రకారం సదరు కోటీశ్వర భిక్షగాడి పేరును పోలీసులు బయటపెట్టలేదు. అతడి నుంచి రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పైగా అతడు సౌదీలో అక్రంగా నివసిస్తున్నట్టు తేలింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles