Jana sena party gearingup for ghmc elections

jana sena party to contest ghmc elections, pawan kalyan janasena party for ghmc contest, trs criticized jana sena president, pawan kalyan criticized by trs leaders

Jana sena party gearingup for GHMC elections moving to get the party recognized by Election Commission

నగరపాలన చేస్తామంటున్న జనసేన

Posted: 07/19/2014 02:49 PM IST
Jana sena party gearingup for ghmc elections

గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చెయ్యటానికి ప్రముఖ సినిమా నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంసిద్ధమౌతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.   అందుకు కావలసిన ఏర్పాట్లలో ఆ పార్టీ పడిందని తెలుస్తోంది.

ఇందుకు గాను ముందుగా ఎన్నికల కమిషన్ నుంచి పార్టీ గుర్తింపు పొందటానికి అప్లికేషన్ ని దాఖలు చెయ్యటం జరిగింది.  దానితో పాటుగా ఈ పార్టీ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలున్నాయా, ఉంటే తెలియజేమని కూడా పత్రికలలో ప్రకటించటం జరిగింది.  గుర్తింపు కోసం అలా ప్రకటన చెయ్యటం అవసరం కూడా.  

సార్వత్రిక ఎన్నికల ముందే పార్టీని స్థాపించినా పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికలలో పోటీచెయ్యనని అప్పడే ప్రకటించారు.  అధికారం కోసం కాదని, ప్రశ్నించటానికే పార్టీని స్థాపించానని అన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాజపా తెదేపాలకు మద్దతుగా ప్రచారం చేసారు కానీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  అయితే, సరైన సమయంలో క్రియాశీల రాజకీయాలలో అడుగుపెడతానని కూడా ఆయన అన్నారు.  

ఆ సమయం ఆసన్నమవుతోంది కాబోలు మళ్ళీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని స్థాపించినప్పుడు విమర్శించిన తెలంగాణా రాష్ట్ర సమితి ఎన్నికలలో పోటీ చెయ్యనని చెప్పిన తర్వాత వ్యాఖ్యానించటం మానేసింది.  ఇప్పుడు మళ్ళీ నగరపాలిక ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ గురించి మరోసారి రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles