Hyderabad demolitions reaches 38 in number

hyderabad demolitions reaches 38 in number, kcr stubborn on irregular buildings demolition, ghmc on demolition spree

Hyderabad demolitions reaches 38 in number thanks to KCR’s stubborn decision on it

38 కి చేరిన కూల్చిన భవనాల సంఖ్య

Posted: 07/17/2014 04:01 PM IST
Hyderabad demolitions reaches 38 in number

నిన్నటి వరకు 27 గా ఉన్న హైద్రాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ కూల్చిన భవనాల సంఖ్య అది 38 కి చేరి ఇంకా బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.  పెద్ద ఎత్తున ఎల్ బి నగర్, పాత్ కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి ప్రాంతాలలో జరుగుతున్న కూల్చివేతలు భారీగా పోలీసుల భద్రతతో జరుగుతున్నాయి.  

అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదాన్ని మోపిన కెసిఆర్ పగ్గాలు వదిలి పూర్తిగా స్వేచ్చనిచ్చి నోటీసులతో కూడా సంబంధం లేదు, అక్రమ నిర్మాణాలు ఉండటానికి వీల్లేదని అన్న నేపథ్యంలో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ కట్టడాలను కూల్చివేసే పనిలో పడ్డారు.  ఇప్పటివరకు తన పరిధిలో 38 భవనాలను కూల్చివేసిన
జిహెచ్ఎమ్ సి టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు అందులో ముమ్మరంగా పనిచేస్తున్నారు.  

అక్రమ కట్టడాల కూల్చివేతల మీద ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయని, కానీ ఆ కూల్చివేసిన కట్టడాలు ఎవరివో తనకు తెలియవని, కేవలం అక్రమ నిర్మాణం జరిగిందన్నది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం స్పష్టం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles