Trs leader manda jaganadam passport theft

passport theft, passport burglary of manda jaganadam, trs leader manda jaganadam

trs leader manda jaganadam passport theft

పది నోటుకు ఆశపడిన జగన్-కొట్టేసిన దొంగలు

Posted: 07/15/2014 11:53 AM IST
Trs leader manda jaganadam passport theft

మన హైదరబాద్ నగరంలో  పట్ట పగలు.. ఒక  రాజకీయ నేతగా ఉన్న జగన్.. కేవలం రోడ్డు మీద పడిన పది రూపాయల కోసం  ఆశపడితే.. , వెంటనే దొంగలు  చేతివాటం చూపించారు.  జగన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదులేండి.. ఈయన  టీఆర్ఎస్ పార్టీ  నేత,  మాజీ ఎంపీ  మందా జగన్నాథం. ఈ టీఆర్ఎస్ నేతకు నగరంలోనే చేదు అనుభవం ఎదురైంది. దీంతో  మందా జగన్నాథం  షాక్ తిన్నారు.   అంటే నగరంలో  దొంగలు  చేతివాటం ఎలా చూపిస్తారో..స్వయంగా  టీఆర్ఎస్ నేతకు అనుభవం కావటంతో.. ఆ ప్రభుత్వం ఎలర్ట్ అయ్యింది.

అసలు ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే..  టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం కారులో కూర్చున్న ఆయన డ్రైవర్ కు మస్కా కొట్టిన దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు.  వెళ్తే, రోడ్డుమీద పది రూపాయల నోటు పడుందని ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ శ్రీనుకు చెప్పారు. దీంతో శ్రీను కారు నుంచి కిందకు దిగాడు. ఇదే సమయంలో దొంగల్లో ఒకడు కారు వెనుక డోర్ తెరిచి బ్యాక్ సీట్లో ఉన్న సూట్ కేసును తీసుకుని పారిపోయాడు. వారిని పట్టుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సూట్ కేసులో మందా పాస్ పోర్టు, రూ. 90 వేల నగదు, కొన్ని ఫైళ్లు ఉన్నాయి. జరిగిన ఘటనపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది స్థానిక దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఏమైన  సిఎం కేసిఆర్ సర్కార్ లో.. దొంగలు  రెచ్చిపోతున్నారు అనటానికి ఇది ఒక నిదర్శనం.  తమ పార్టీ నేతకు  దొంగలు చేతివాటం చూపిస్తే.. ఇక  సామాన్య ప్రజలకు దొంగలు చుక్కలు చూపిస్తారనే విషయం అందరికి తెలిసింది.  దీంతో టీఆర్ఎస్ నేతలు  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles