Apngo president ashok babu questioning cm kcr

apngo president ashok babu questioning cm kcr, apngo president ashok babu latest news, ashok babu latest news, ashok babu comments on kcr, ashok babu fires on kcr, ashok babu met with cm kcr, apngo land issues

apngo president ashok babu questioning cm kcr

కేసీఆర్ ను ప్రశ్నించనున్న ఆరడుగుల బుల్లెట్!

Posted: 07/10/2014 11:40 AM IST
Apngo president ashok babu questioning cm kcr

(Image source from: apngo president ashok babu questioning cm kcr)

ఒక్కనిముషం ఆగండి..! ఇక్కడ ఆరడుగుల బుల్లెట్ అంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదు... విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధాన ఉద్యమకారుడయిన ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు. అప్పట్లో ఈయన చేసిన వీరంగానికి సీమాంధ్ర ప్రజలు ఈయనకు ఆరడుగుల బుల్లెట్ గా పేరు పెట్టుకున్నారులెండి! ఇదీ అసలు సంగతి!

ఇక అసలు విషయానికి వస్తే.. కొన్నిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ విషయంపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు.. ‘‘ఎన్నో దశాబ్దాలపాటు ఉద్యోగులకు కేటాయించిన భూమిని ప్రభుత్వం ఇలా అర్థంతరంగా వెనక్కు తీసుకోవడం మంచిది కాదని... ఇది ఎంతవరకు న్యాయమని’’ ఆయన వ్యాఖ్యనించారు. ఈ ఘటనపై తాము త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుస్తామని చెప్పిన ఆయన... తమకు కేటాయించిన భూముల్లో ఇళ్లనిర్మాణాలు ఎందుకు మొదలుపెట్టలేదో వివరిస్తామని పేర్కొన్నారు.

అలాగే ఏపీఎన్జీవోల ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని.. కానీ అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగుల మీద ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంపై కేసీఆర్ ను ప్రశ్నిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణాలో సీమాంధ్రలు నివసించడానికి సర్వాధికారాలు వున్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రులపై వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాల్సిందిగా ఆయన కోరారు.

అయితే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సమైక్యవాది అయిన అశోక్ బాబును కలుసుకుంటారా..? ఒకవేళ కలుసుకుంటే... అశోక్ బాబు అభిప్రాయం మేరకు ఆయన తన వైఖరిని మార్చుకుంటారా..? దీనిమీద కేసీఆర్ ఎలా స్పందించనున్నారు..? ఏపీఎన్జీవోలకు ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు..? అనే అంశాలపై ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles