Congress shocked with 8 defectors

congress shocked with 8 defectors, telangana council chairman elections, 8 congress mlcs jump to trs side

congress shocked with 8 defectors

కాంగ్రెస్ పార్టీకి ఎనిమిదివైపుల నుంటి పోటు

Posted: 07/02/2014 04:10 PM IST
Congress shocked with 8 defectors

తెలంగాణా శాసనమండలి ఛైర్మన్ పోస్ట్ కోసం ఈ రోజు జరిగిన ఎన్నికలలో 21 మంది వోటు హక్కును వినియోగించుకోగా, ఆ 21 వోట్లూ తెలంగాణా రాష్ట్ర సమితి తరఫున నామినేషన్ వేసిన స్వామి గౌడ్ కే పడ్డాయి.  అందుకు కారణం కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు మండలి ఛైర్మన్ ఎన్నికలను బహిష్కరించటం ఒక్కటే కాకుండా కాంగ్రెస్ పార్టీలోను ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారు.  

అంతకు ముందే కాంగ్రెస్ ని వదిలేసి వెళ్ళిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర రెడ్డి, భాను ప్రసాద్, వి భూపాల్ రెడ్డి, రాజలింగం బాహాటంగానే తెలంగాణా భవన్ లో కెసిఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.  ఆ తర్వాత ఎమ్మెల్సీలు రాజేశ్వర రావు, యాదవరెడ్డి కూడా తమ ఓటు స్వామి గౌడ్ కి మద్దతుగా వేసి కాంగ్రెస్ పార్టీని చకితులను చేస్తే, ఎన్నికలు జరుగుతున్న సమయంలో మండలి ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ నాయకుడు నేతి విద్యాసాగరరావు కూడా స్వామి గౌడ్ కి వోటేసి షాకే ఇచ్చారు.  

ఇంతవరకు మొదటి ఐదుగురి మీదా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కోరుతున్న నేపథ్యంలో మరో ముగ్గురు కూడా అదే బాటలో పోవటంతో పార్టీకి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.  ఇప్పటికే వెళ్ళిపోయిన ఆ ఎనిమిది మందినీ పార్టీ సభ్యత్వం నుంచి తప్పించటం వలన కాంగ్రెస్ పార్టీకి అదనంగా కలిగే లాభమైతే ఏమీ ఉండబోదు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles