Schools closeddue to heat in guntur

Schools closed in Guntur for two days, Schools closeddue to heat in Guntur, heat waves in AP for Delayed monsoon

Schools closeddue to heat in Guntur

వానాకాలం చదువులు

Posted: 06/25/2014 09:27 AM IST
Schools closeddue to heat in guntur

పూర్వకాలంలో చాలాచోట్ల సరైన పాఠశాల భవనాలు లేని కారణంగా ఏ చెట్టుకిందనో పాఠాలు చెప్పి సంవత్సరాన్ని దొర్లించేసేవారు.  కానీ వర్షం పడితే మాత్రం ఆ రోజు స్కూల్ కి సెలవే మరి.  అందుకే అటువంటి చోట చదివే పిల్లల చదువులను వానాకాలం చదువులు అనేవారు.  

అదే పరిస్థితి ఈ వానాకాలంలోనూ వచ్చింది.  కానీ వేరే విధంగా.  వానరావటం వలన చదువులు ఆగిపోవటం కాదు, వాన రాక చదువులు ఆగిపోతున్నాయి.  

ఋతపవనాలను ఎలినో పక్కకు నెట్టేయటంతో వర్షం పడాల్సిన రోజుల్లో వర్షాలు పడక ఎండ వేడికి ఇరు రాష్ట్రాలలోను పరిస్థితి ఇబ్బందిగానే ఉంది.  ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువగా ఉండటంతో జూన్ 25, 26 తేదీల్లో స్కూళ్ళకు సెలవులివ్వాలని  గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు.  

ఏ వంకన సెలవులొచ్చినా పిల్లలకు పండుగే మరి!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles