Union minister nihal chand meghwal faces rape charges

Union Minister Nihal Chand Meghwal faces rape charges, Union Minister faces 4 year old rape charges, Center Minister Meghwal and 17 others issued notices by district court, District Court asks Minister to explain before August 20

Union Minister Nihal Chand Meghwal faces rape charges

వేలెత్తి చూపగానే మంత్రి పదవి నుంచి తొలగిస్తారా?

Posted: 06/14/2014 02:12 PM IST
Union minister nihal chand meghwal faces rape charges

కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ కి జయ్ పూర్ జిల్లా కోర్టు నాలుగు సంవత్సరాల క్రితం చేసిన అత్యాచార ఆరోపణ మీద నోటీసు పంపించింది.  

మోదీ మంత్రి వర్గంలో రాజస్తాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి 42 సంవత్సరాల మేఘ్వాల్ రాజీనామా చెయ్యాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.  కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, ఇది మోదీకి ఒక సవాల్ అని, ఇది గంభీరమైన విషయం కాబట్టి మోదీ మేఘ్వాల్ ని మంత్రి పదవినుంచి తప్పించాలని అన్నారు.  పారదర్శకత, నిరాడంబరతల మీద ఉపన్యాసం ఇచ్చే మోదీ దీన్ని తేలిగ్గా తీసుకోగూడదని సచిన్ పైలట్ అన్నారు.

2011 లో ఒక మహిళ చేసిన ఆరోపణ ప్రకారం, ఆమె భర్త ఆమెకు రోజూ మత్తుమందిచ్చి పడుకోబెట్టి అతని స్నేహితులను పిలుస్తుండేవాడట.  అలా ఆమె అనుమతి లేకుండా ఆమె స్పృహలో లేనప్పుడు ఆమె మీద అత్యాచారం చేసిన వాళ్ళల్లో మేఘ్వాల్ కూడా ఉన్నారట.  ఆమె మేఘ్వాల్ తో పాటు మరో 17 మంది మీద అభియోగం మోపటం జరిగింది.  తన భర్త చిన్న రాజకీయ నాయకుడు అవటంతో రాజకీయరంగంలో ఎదగటం కోసం అలా చేసారని ఆమె కారణం కూడా చెప్పుకొచ్చింది.  ఈ అభియోగం నిరాధారమైనదని, కట్టుకథని రాజస్తాన్ పోలీసులు 2012లో ఆ కేసుని మూసివేసారు. 

ఆతర్వాత ఆమె జిల్లా కోర్టుకి పోగా అక్కడ కూడా ఆమె అభియోగాన్ని అక్కడ కూడా డిస్మిస్ చేసారు.  అయితే ఆమె మరోసారి రివ్యూ పిటిషన్ ని వెయ్యటంతో జిల్లా కోర్టు దీని మీద ఆగస్ట్ 20 లోపులో స్పందించవలసిందిగా నోటీసులు జారీచేసింది.

ఆతర్వాత మేఘ్వాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈ విషయంలో చర్చించి తన స్థితిని స్పష్టం చేసారు.  దానితో భారతీయ జనతా పార్టీ, ఈ విషయంలో మేఘ్వాల్ రాజీనామా చెయ్యవలసిన అవసరం లేదని ప్రకటించింది.  

"ఈ కేసు మీద 2012 లో గెహ్లాత్ ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసుని మూసివేసినట్లుగా తెలియజేసారు.  దాన్ని ఫిబ్రవరి 2014లో జిల్లా కోర్టు కూడా స్వీకరించింది.  ఇవి కేసు పూర్వాపరాలు.  ఈ కేసులో మరేమైనా ముందుకు వెళ్తే ఆ సందర్భాన్నిబట్టి న్యాయపరంగా మేము సరైన సమాధానం ఇస్తాం"  అంటూ భాజపా అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ప్రకటన చేసారు.  

ఫిర్యాదు చేసిన మహిళ తన భర్త, అతని సోదరుడు కలిసి తనకి మత్తు మందిచ్చి సమాజంలో బాగా పలుకుబడివున్న వారితో అత్యాచారం చేయించేవారని పేర్కొంది.  ఆమె చేసిన ఎఫ్ఐఆర్ లో మేఘ్వాల్ తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక పోలీస్ ఆఫీసర్, రాజస్తాన్ యూనివర్శిటీ మాజీ ప్రెసిడెంట్ ఉన్నారు.

అయితే నిరాధారంగా వేలెత్త చూపించినంత మాత్రాన ఒక మంత్రని పదవి నుంచి తొలగిస్తారా అన్నది ప్రశ్న.  అలా చేసుకుంటూ పోతే ఎవరి మీదైనా ఎవరైనై ఏమైనా ఆరోపణ చెయ్యవచ్చు.  

కానీ అదే నిజమైతే, ఆమె ఆధారాలు ఎక్కడి నుండి తేగలదు?  ఆమె భర్త కానీ మరిది కానీ చేసిన పనిని ఒప్పుకుంటారా?  అత్యాచారం చేసినవారిలో ఎవరైనా తమ తప్పును అంగీకరిస్తారా?  ఆధారాలు ఎక్కడి నుండి దొరుకుతాయి?  దోషిని గుర్తించమని పోలీసులు ఇంతవరకు బాధితురాలిని అడగకపోవటం విశేషం!

అందువలన న్యాయపరంగా ఏం జరుగుతుందన్నది వేచి చూడవలసిందే!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles