Home minister nayani narsimha reddy sieged

home minister nayani narsimha reddy, Himachal Pradesh Incident, VNR Vignana Jyothi Institute of Engineering and Technology Students, nayani narsimha reddy

home minister nayani narsimha reddy sieged, Telangana home minister Nayani Narasimha Reddy

హోంమంత్రి నాయినికి తగిలిన స్టూడెంట్స్ దెబ్బ!

Posted: 06/09/2014 09:05 AM IST
Home minister nayani narsimha reddy sieged

హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న నదిలో కోట్టుకుపోయిన తెలుగు విద్యార్థులు ఆచూకి పై తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోవటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు.. హోంమంత్రి నాయిని పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన సంఘటనా స్థలికి చేరుకుంటారు.

కాగా, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద నాయిని నర్సింహారెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యం సంఘటనా స్థలానికి తీసుకెళతామని చెప్పడంతో విద్యార్థులు తల్లిదండ్రులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles