Amitabh praises all wives in his blog

Amitabha Jaya 41 wedding anniversary, Amitabh praises all wives in his blog, 41 wedding anniversary not celebrated by Bachchans

Amitabh praises all wives in his blog

పెళ్ళిరోజున భార్యలందరినీ గుర్తుచేసుకున్న అమితాభ్!

Posted: 06/03/2014 06:18 PM IST
Amitabh praises all wives in his blog

అమితాభ్ బచ్చన్ జయ బచ్చన్ ని వివాహమాడి 41 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ప్రపంచంలోని మగవారి అర్ధాంగినులందరినీ గుర్తుచేసుకున్నారు.  కుటుంబ సభ్యులంతా వేరు వేరు చోట్ల బిజీగా ఉండటంతో జూన్ 3 1973 న వివాహబంధంలో ముడిబడ్డ అమితాభ్ జయ ల 41 వ పెళ్ళిరోజుని అందరూ కలిసి వేడుకగా చేసుకోలేకపోతున్నారు.

ఫోటోలో 39 వ పెళ్ళిరోజున అమితాభ్ జయ బచ్చన్ లు

amitabh-jaya

వివాహితుల విషయంలో అమితాభ్ బచ్చన్ బ్లాగ్ లో ఇలా పోస్ట్ చేసారు-

"ఎంతో ఆడంబరంగా వివాహం, సాన్నిహిత్యం, గౌరవం ఇచ్చి పుచ్చుకోవటాలు, ఆచార వ్యవహారాలను మన్నించటాలు, ఈ కోలాహలం మధ్యలో ఉన్నట్టుండి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించటం జరుగుతుంది.  ఆమే అర్ధాంగి!  శరీరంలో సగభాగం!  ఆమె జీవితంలో ఆనందాన్ని నింపుతుంది.  జీవనశైలిలో సామరస్యాన్ని తీసుకునివస్తుంది.  వంశాన్ని వృద్ధి చేస్తుంది.  గృహానికి శోభను తెస్తుంది.  హృదయాన్ని గెలుచుకుంటుంది. 

"అలాంటి భార్యలు ప్రత్యేకతలను సంతరించుకుంటారు! 

"ప్రపంచంలో అటువంటి గుణాలుగల భార్యలందరికీ దైవానుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.  ఎందుకంటే వాళ్ళే జీవితాలను తీర్చిదిద్దేవారు, వాళ్ళతోనే భవిష్యత్తు!  వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవలసిన అవసరం ఉంది.  మహిళలు మగవారిలో సగభాగమే కాదు బెటర్ హఫ్- మెరుగైన సగభాగం.  అంటే మగవారికన్నా హెచ్చు స్థాయిలో ఉన్నవారు.

"అటువంటి మహోన్నతమైన మహిళలకు నేను ఈ బ్లాగ్ ని అంకితమిస్తున్నాను! 

"మీరు ఇతరుల సంక్షేమం కోసం జీవిస్తూ, వాళ్ళని ముందుకు నడిపిస్తున్నారు.  మీరే బలం, మీరే బలహీనత!  మీరు మీ గృహాన్ని చక్కదిద్దారు-  నిజానికి అది మీరు అల్లుకున్న గూడు.  అందులోకి మీరు మీ జీవిత భాగస్వామిని ఆహ్వానించారు.  ఎంత గొప్పతనమది!"

అమితాభ్ లో ఒక అద్భుతమైన రచయిత కూడా దాగివున్నాడని ఈ బ్లాగ్ తో అర్థమౌతోంది కదూ! 

41 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని గడిపిన అమితాభ్ బచ్చన్ జయ బచ్చన్ లకు ఈ పెళ్ళి రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో సంవత్సరాలు ఇలాగే అర్థవంతమైన, ఆనందమయమైన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ- తెలుగు విశేష్

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles