Governor offers sweets and appreciates chandrababu

Chandrababu meets Governor with MLAS and MPs elected, Governor offers sweets and appreciates Chandrababu, Elected MLAs and MPs of TDP meet Governor

Governor offers sweets and appreciates Chandrababu

తీపి తినిపించి తీయని మాట చెప్పిన గవర్నర్

Posted: 05/20/2014 09:19 AM IST
Governor offers sweets and appreciates chandrababu

సోమవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి స్వీట్ తినిపించిన గవర్నర్ ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు.  

చంద్రబాబు దూరదృష్టిని, పాలనా దక్షతను కొనియాడిన గవర్నర్, ఆయన పట్టు పట్టారంటే సాధించేంతవరకూ వీడరని, ఎన్నికలకు ప్రజాహితంలో తయారు చేసిన మేనిఫెస్టో తో ఆయన విజయాన్ని సాధించుకొచ్చారని అన్నారు.  

చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మల్యేలు ఎంపీలలో కొందరితో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన సందర్భంలో పై విధంగా చంద్రబాబుని పొగిడిన గవర్నర్, తెలుగు దేశం నాయకులను ఉద్దేశించి, ఆయన ఒక్కరూ కష్టపడితే చాలదని, అందరూ పనిచేస్తేనే అనుకున్నది సాధిస్తారని అన్నారు.  

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయన బృందం కోసం ప్రత్యేకంగా మిఠాయిలు తెప్పించిన గవర్నర్, చంద్రబాబు ఆహారపు అలవాట్లు తెలుసుకనుక, మీరు ఆహారం విషయంలో చాలా నియమనిష్టలతో ఉంటారని నాకు తెలుసు కానీ ఈ సారికి వాటిని పక్కకు పెట్టి ఈ మిఠాయి తినండి అని గవర్నర్ ఆయన చేత బలవంతంగా తినిపించారు.  

ఆ తర్వాత చంద్రబాబుతో గవర్నర్ ఏకాంతంగా మాట్లాడారు.  అందులో రాష్ట్రానికి నిధులు, పెండింగ్ పనులు మొదలైన ఎన్నో విషయాలు ప్రస్తావనలోకి వచ్చాయని తెలిసింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles