Zptc mptc counting complete

ZPTC MPTC counting complete, TDP leading in Seemandhr, TRS leading in Telangana, State Election officer Ramakanth Reddy,

ZPTC MPTC counting complete state Election Officer declares

వోట్ల లెక్కింపు పూర్తి- తడిచినవాటితో సహా!

Posted: 05/14/2014 02:35 PM IST
Zptc mptc counting complete

తడిచిపోయిన చెదలు పట్టిన వోట్లతో సహా అన్నిటి లెక్కింపు పూర్తయిందని చెప్పిన రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి, ఈ తతంగంలో పాలుపంచుకున్న అందరు అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి 35 బ్యాలెట్ బాక్స్ లను తెప్పించినట్లుగా చెప్పారు.  

లెక్కింపు పూర్తయిన సందర్భంగా ఎన్నికల అధికారి ప్రకటించిన ఫలితాలు ఇవి-

సీమాంధ్రలో నిర్వహించిన 653 జెడ్పీటిసి స్థానాలలో తెదేపా 373, వైకాపా 275, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 2 స్థానాలను గెలుచుకున్నారు.  10092 ఎంపిటిసి స్థానాలలో తెదేపా 5216, వైకాపా 4199, కాంగ్రెస్ 172, సిపిఎమ్ 24, సిపిఐ 14, భాజపా 18, స్వతంత్రులు 428 స్థానాలలో గెలుపొందారు.

తెలంగాణాలో నిర్వహించిన 443 జెడ్పిటిసి స్థానాలలో 440 స్థానాలకు ఫలితాలు వెల్లడి కాగా అందులో తెరాస 191, కాంగ్రెస్ 176, తెదెపా 53, వైకాపా 6, భాజపా 4, సిపిఎం 2, సిపిఐ 2, బిఎస్పీ 1, స్వతంత్ర అభ్యర్థులు ఐదు స్థానాలలో గెలుపొందారు.  6525 ఎంపిటిసి స్థానాలలో 6467 స్థానాలకు ఫలితాలు వెల్లడి కాగా అందులో కాంగ్రెస్ 2351 లో ముందంజలో ఉంది.  తెరాస 1860, తెదేపా 1061, భాజపా 275, సిపిఎం 145, సిపిఐ 80, వైకాపా 121, బిఎస్పీ 28, లోక్ సత్తా 1, ఇతరులు 23, స్వతంత్రులు 500 స్థానాలలో గెలుపొందారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles