Ysrcp activists attack on congress candidate jayasudha

janasudha, janasudha political leader, janasudha congress mla candidate, secunderabad area, janasudha campaign, janasudha vehicle attacked ycp leaders, janasudha complaint police, police arrest ycp leaders, ys jagan, election 2014

YSRCP activists attack on Congress candidate Jayasudha

జయసుద పై వైఎస్ జగన్ దెబ్బలు?

Posted: 04/27/2014 12:09 AM IST
Ysrcp activists attack on congress candidate jayasudha

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జయసుధ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మెట్టుగూడలో ఉదయం ప్రచారం ప్రారంభించారు. ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జయసుధ వాహనం పైన దాడికి పాల్పడ్డారు. 

దీంతో ఒక్కసారిగా నిశ్చేష్టురాలైన జయసుధ.. తన ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు దాడి చేసిన వారని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో జయసుధ డ్రైవర్ పైన జగన్ పార్టీ నాయకులు ఒకరు చేయి చేసుకున్నారు.

జయసుధ తన పైన దాడికి ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తమ కాన్వాయ్ పైన దాడికి యత్నించారని, చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్టుగూడ నుండి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు. అంతకుముందు జయసుధ కాన్వాయ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles