మొదటిసారిగా క్రియాశీల రాజకీయాలలో అడుగుపెడుతున్న నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలుచేసారు. బాలకృష్ణ ముఖ్యమంత్రి ఆసనాన్ని అలంకరించబోతున్నారనే వార్తలు కూడా బాగా వినబడుతున్నాయి. ఈ విషయంలో ఒక్క బాలకృష్ణ అభిమానులే కాదు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే కాదు రాష్ట్రమంతా ఆనందపడాల్సిన సమయం. ఎందుకో చూద్దాం!
తెలుగు దేశం పార్టీయే గనక కుదించిన కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నట్లయితే, జాతీయ స్థాయిలో కూడా పనిచెయ్యదలచుకున్న చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు పట్టుకుని నడిపించే పనిలో వ్యస్తులై, రాష్ట్రాన్ని నడిపించటానికి బాలకృష్ణకు అధికారాన్ని చేతికివ్వవచ్చు. చంద్రబాబు కూడా కుప్పం నుంచి అసెంబ్లీ స్థానానికే నామినేషన్ వేసినా, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ అధ్యక్షురాలిగా పనిచేస్తూ మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిగా చేసినట్లుగా, తెదేపా అధ్యక్ష పదవిలో చంద్రబాబు నాయుడు పార్టీని రథ సారధిగా ముందుకు నడిపిస్తుంటే, బాలకృష్ణ ఆయన సారధ్యంలో రాష్ట్ర వికాసం కోసం యుద్ధాన్ని సాగించవచ్చు.
అయితే ఇక్కడ మన్మోహన్ సింగ్ తో బాలకృష్ణను పోల్చటం లేదనుకోండి! ఆయన చేతికి నిజంగా అధికారాలు ఇవ్వలేదని, అంతా సోనియా గాంధీయే నడిపిస్తోందన్న విషయాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనకు సన్నిహితంగా పనిచేసినవాళ్ళే తమ అనుభవాలను గ్రంధస్తం చేసి వెల్లడిచేసారనుకోండి! అందువలన మన్మోహన్ సింగ్ తో పోల్చి చెప్పటం లేదు. జ్ఞాన పరిపక్వతలో, వ్యవహారంలో ఇద్దరిలో చాలా పెద్ద వ్యత్యాసం ఉంది కూడా!
1. బాలకృష్ణలో మొండితనం ఉంది. పట్టుదల ఉంది, దాన్ని సాధించుకోవటానికి తన పలుకుబడిని మొత్తాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం ఉంది. ఆయన మాటలకు ఎవరూ ఎదురు చెప్పరు. ఆయన కోపాగ్నికి ఎవరూ దగ్ధమవదలచుకోరు. కోపావేశంలో ఆయన చటుక్కున రివాల్వర్ బయటకు తీస్తారేమో అనే భయం కూడా ఉంది. అయితే ఆయనలో ఉన్న మంచి లక్షణం బావ చంద్రబాబు మాటలను శిరసావహించటం. ఈ లక్షణాల వలన చంద్రబాబు సారధ్యంలో చక్కని యోధుడవుతారు బాలకృష్ణ. తప్పో ఒప్పో మొండిగా, ముక్కుకు సూటిగా పోయి, ఏది ఏమైనాసరే వదలకుండా, పట్టుదలతో సాధించటమనేది నాయకుడిని అగ్ర స్థానంలో కూర్చోబెడుతుంది. ఈ లక్షణం తెలుగు దేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ లో కూడా ఉండేది. దాని వలన పనులు జరుగుతుండేవి. బాగా ఆలోచించేవారు ఏమీ చెయ్యలేరు. తర్జనభర్జనలోనే ఉంటారు. మనసులో వచ్చిన ఆలోచనను క్రియారూపంలో పెట్టాలని అనుకున్నవారే టక్ మని వెనకా ముందూ చూడకుండా చేసేస్తారు.
2. బాలకృష్ణ ముఖ్యమంత్రి అయినట్లయితే కలిగే మరో పెద్ద ప్రయోజనం, ఆయన పార్టీలోనూ, కుటుంబంలోను అంతర్గత పోరాటాలను లేకుండా చెయ్యగలుగుతారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ వారసులను పక్కకు పెట్టేసి అధికారమంతా తన చేతిలోనే పెట్టుకున్నారనే అపప్రధ కూడా చంద్రబాబు నాయుడు నుంచి తొలగిపోతుంది. హరికృష్ణ, పురంధేశ్వరి కూడా సంతృప్తి చెందుతారు. దానితో ఇల్లు చక్కదిద్దుకుంటూ సొంతమనుషుల మధ్య కయ్యాలను తీర్చే పని తగ్గిపోయి ఆ సమయమంతా రాష్ట్ర పరిపాలన మీద పెట్టటానికి వీలవుతుంది.
3. మరో ప్రయోజనం ఏమిటంటే చంద్రబాబులా బాలకృష్ణ తన కులస్తుల హస్తాలలో వారితో ముఖమాటంలో కాని లేరు. ముఖ్యమంత్రి పనిచెయ్యవలసింది రాష్ట్ర ప్రజలందరికోసం కానీ కేవలం ఒక కులం కోసం కాదు. కాబట్టి బాలకృష్ణ రావటం వలన అది కూడా నెరవేరుతుంది. ఆయన మీద కులపెద్దల ప్రభావం చంద్రబాబుకి ఉన్నంతగా ఉండదు కాబట్టి ప్రజలందరినీ దాదాపు సమానంగా చూడగలుగుతారు. ఉండేదే ఐదు సంవత్సరాల కాలం. అందులో కుమ్ములాటలలో సమయాన్ని నష్టం చేసుకునేబదులు చేపట్టిన బాధ్యతలను నెరవేర్చటానికే ఆ సమయాన్ని ఉపయోగించినట్లయితే అది ప్రజాహితంలో పనిచెయ్యటమే కాకుండా, ఆయన మీద ప్రజలలో పెరిగిన విశ్వాసం వలన ఆయన మరోసారి అదే గద్దెమీద కొనసాగే అవకాశం కూడా లభిస్తుంది.
చంద్రబాబు నాయుడు స్వయంగా అధికారాలు చేపట్టి ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం లేదు. ఆయన నిజానికి కొత్త వారికి- బయటివారికి కాకపోయినా కనీసం యువతకు అంటే జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, బ్రాహ్మణిలకు అవకాశం ఇచ్చి తాను వెనక నుండి తన అనుభవంతో సూచనలిచ్చి నడిపించాలి. అంటే కింగ్ గా కాకుండా కింగ్ మేకర్ గా పనిచెయ్యవలసిన అవసరం ఉంది ఆయన ఉన్న పరిస్థితులలో. అప్పుడాయన మీద ఉన్న మరో నింద తొలగిపోయి "పవర్ పిచ్చి బాబు" అనుకోవటం మానేసి "చాలా మంచి బాబు" అనుకుంటారు. కానీ మరీ అంత పిన్నవయసువారికిచ్చే దానికంటే చంద్రబాబు కంటే చిన్న వయసులో ఉండి చంద్రబాబు కంటే ఎక్కువ శక్తివంతంగా పనిచెయ్యగలిగి, అన్నిటికన్నా ముఖ్యం ఆలోచనకు తక్కువ, దూకుడుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మొండిగా ముందుకెళ్ళే గుణమున్న బాలకృష్ణ ఈ సమయంలో తెలుగు దేశం నుంచి ముఖ్యమంత్రిగా సరైన అభ్యర్థి. కాకపోతే, కొత్త ఆంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రి అనే పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే అవకాశమైతే చంద్రబాబుకి లేకుండా పోతుంది!
అయితే ఇదంతా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే సంగతనుకోండి!
తెదేపా రాని పక్షంలో అవకాశమున్నది వైయస్ ఆర్ కాంగ్రెస్ కే. అందులో కూడా మొండిగా ముందుకెళ్ళే నాయకుడే ఉన్నారు. మంచైనా చెడైనా ఏదైనా తన మీదకే తీసుకునే నాయకుడు. అదీ ఆ పార్టీలో ఉన్న ఉపయోగం. ఎక్కడి నుంచీ ఏ విధమైన వత్తిడి కానీ, కుటుంబంలోంచి నిరసనలు కాని లేవు- బాణాలింకా ఎక్కుపెట్టలేదెవరూ!
మళ్ళీ తెదేపా విషయానికొస్తే, పార్టీకి వెన్నుదండలుగా నిలిచే కులసభ్యులతో కానీ, పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కానీ, పార్టీ సభ్యులతో కానీ, శాసనసభ్యులతో కానీ, రేప్పొద్దన్న పార్టీ గెలిస్తే తయారయ్యే క్యాబినెట్ సభ్యులతో కానీ ఎటువంటి సమస్యలూ ఎదురవకుండా (బాలయ్య- ఎవరిమాటా వినడు అనే సబ్ టైటిల్ ఉన్నట్టుగా) తను అనుకున్నది చేసేసే బాలయ్య బాబు చంద్రబాబు కంటే ముఖ్యమంత్రి పదవికి పైన చెప్పుకున్న విధంగా అన్ని విధాలా యోగ్యుడని అనిపిస్తోంది. ఏమంటారు?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more