భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఈ రోజు వడోదర లో కీర్తి స్తంభం నుంచి కలెక్టరేట్ వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ర్యాలీగా వచ్చి నామినేషన్ ని దాఖలు చేసారు.
కమలం గుర్తుతో అలంకరించిన ఓపెన్ జీప్ లో ర్యాలీగా వెళ్ళిన నరేంద్ర మోదీతోపాటుగా వేలాదిమంది మద్దతుదార్లు ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్ వేస్తున్నప్పుడే ఆయనకి ఎంత మద్దతు ఉందన్నది వడోదరలో అర్థమౌతోంది.
కుర్తా పైజమా మీద ఎర్రటి ఎరుపు రంగు జాకెట్ వేసుకున్న నరేంద్ర మోదీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నామినేషన్ కి వెళ్ళారు.
విశేషమేమిటంటే కలెక్టరేట్ లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినవారు కిరణ్ మహిదా అనే చాయ్ వాలా. అలాగే మరోపక్క శుభాంగిని దేవి రాజే గాయక్వాడ్ అనే రాచ కుటుంబానికి చెందిన మహిళ కూడా ప్రతిపాదించారు. తన చిన్నప్పుడు చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ దేశానికి అతి పెద్ద పీఠానికి పోటీ చేస్తున్నా, తన మూలాలు మర్చిపోలేదనే సంకేతాన్నిస్తూ చాయ్ వాలా చేతనే ప్రతిపాదన చేయించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ, ఏప్రిల్ 30 న ఓటు వేసి వడోదర ప్రజానీకం ప్రజాస్వామ్య వేడుకను ఉత్సాహభరితంగా చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.
కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సన్నిహితుడు మధుసూధన్ మిస్త్రీ వడోదరలో పోటీ చేస్తున్నారు.
గంజి పెట్టిన తెల్ల రంగు కాటన్ షర్ట్ లో దర్జాగా, గుజరాత్ హీరో మోదీ, రాజవంశీయుల సరసన కూర్చున్న చాయ్ వాలా మహిదా తనకు కలిగిన గౌరవానికి సంతోషాన్ని వ్యక్తపరచారు.
"నేను చాయ్ వాలాను నిజమే. దేశంలోని చాయ్ వాలా లెవరికైనా ప్రధాన మంత్రి అయ్యే హక్కుంది, అది రాజ్యాంగం ప్రసాదించిం" దంటూ నరేంద్ర మోదీ అనేక మార్లు కాంగ్రెస్ ప్రత్యర్థుల వ్యాఖ్యానాలను తిప్పికొట్టారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more