Sonia meeting imam

Sonia meets Imam and Muslim leaders, Election code of conduct, Chief Election Commissioner VS Sampath, BJP objects Sonia meeting Imam, Shahi Imam of Delhi Jama Masjid

Sonia meets Imam and Muslim leaders

సోనియా ఇమామ్ ని కలవటం మీద చర్య తీసుకుంటాం-ఇసి

Posted: 04/03/2014 05:48 PM IST
Sonia meeting imam

ఢిల్లీ జామా మస్జిద్ షాహి ఇమామ్ సయ్యద్ బుఖారీ ని సోనియా గాంధీ కలిసి మాట్లాడటాన్ని తప్పపట్టగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా దానిమీద విచారణ, తగు చర్య ఉంటుందని చెప్పారు ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ విఎస్ సంపత్.

ముస్లిం నాయకులను కలిసిన సోనియా గాంధీ, ముసల్మానుల వోట్లు చీలకుండా చూడమని కోరటం సబబు కాదన్నది ఆరోపణ.  దీన్ని సుమోటు కాగ్నిజెన్స్ లో తీసుకోమని భారతీయ జనతా పార్టీ కోరిన దానిమీద విఎస్ సంపత్ అభిప్రాయాన్ని మీడియా ప్రతినిధులు కోరగా, సామాన్యంగా ఇలాంటి కేసుల్లో ఫిర్యాదులు వచ్చినప్పుడు కాగ్నిజెన్స్ కేసుగా పరిగణిస్తామని ఆయన అన్నారు. 

సోనియా గాంధీ చర్య పూర్తిగా అభ్యంతకరమని, మతం కులాల ప్రాతిపదిక మీద వోటర్లను వోట్ల కోసం అడగటం ఎన్నికల కోడ్ ని పూర్తిగా ఉల్లంఘించటమే అవుతుందని, దీని మీద ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంటుందని నమ్ముతున్నామంటూ భాజపా అధికార ప్రతినిధి మీడియా ప్రతినిధులతో అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles