Manmohan singh worries about scams at the end of his career

Manmohan singh worries about scams, Scams at the end of PM career, Scams of Manmohan like PV after retirement, Narendra Modi, Rahul Gandhi, Sonia Gandhi

Manmohan singh worries about scams at the end of his career

పదవి వదిలే సమయానికి ప్రధానికి పట్టుకున్న దిగులు

Posted: 03/11/2014 02:58 PM IST
Manmohan singh worries about scams at the end of his career

మరో మూడు నెలల కాలం మాత్రమే పదవిలో ఉండబోతున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని ప్రస్తుతం బాధిస్తున్న సమస్య ఒకటే.  పదవీకాలం తర్వాత రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా గడుపుదామనుకుంటున్న తనని పివి నరసింహారావుకి జరిగినట్లుగా స్కాములు వేధించవు గదా అన్న ఆలోచన.

ఈ విషయంలో ప్రధానమంత్ర కార్యాలయంలో అధిక శాతం ఆయనకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు.  ఆయన గౌరవనీయులని, కాకపోతే మెతకతనం వలనే మిత్రులతోనూ శత్రువలతోనూ ఆయన బాధలను సహిస్తూ వస్తున్నారని అభిప్రాయపడుతున్నారు చాలామంది. 

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి ప్రధానంగా పట్టుకున్న దిగులు ఒక్కటే.  భాజపా అధికారంలోకి వచ్చినట్లయితే నరేంద్ర మోదీ తన మీద కక్ష తీర్చుకుంటాడేమో, బొగ్గు, 2 జి స్కాములు తనని జీవితాంతం వెంటాడుతాయేమో అని.  కొన్ని సందర్భాల్లో ఆయన తన కార్యాలయంలో, నేనే తప్పూ చెయ్యలేదు.  గౌరవంగా వెళ్ళిపోదామనివుంది అన్నారట.  నేను నిజాయితీగా అంకితభావంతో పనిచేసాను అని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అంటూ వచ్చారు.  పివి నరసింహారావు కూడా పదవి నుంచి దిగిపోయినా ఆయనను ఆరోపణలు వదిలిపెట్టలేదు. 

కాంగ్రెస్ పార్టీ ఆయన కొమ్ముకాయలేదని అభిప్రాయపడేవారూ ఉన్నారు ఆయన ఆఫీస్ లో.  ఎవరికోసం చేసినా చివరకు తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించవలసి వస్తుందాయనకు.  మన్మోహన్ సింగ్ ఎన్నోసార్లు తను చట్టానికి అతీతుడు కానని, దర్యాప్తు చేసే సంస్థలు ఏమడిగినా తాను దాచుకోకుండా నిజాయితీగా నిజం చెప్పేస్తానని అన్నారు.

ఇంత మానసిక వత్తిడిలోనూ 81 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఆఫీస్ పనులను ఇంకా చక్కగా నిర్వహిస్తుండటం ప్రధాని కార్యలయంలోని సిబ్బందిని ఆశ్చర్యపరుస్తోంది.  ఎన్నికల కోడ్ వచ్చే లోపులో ఆయన భేటీల సమయాన్ని రెట్టింపు చేసారు, ప్రతి నెలా 300 ఫైళ్ళను డిస్పోజ్ చేసారంటూ ఆయన కార్యలయంలోని సిబ్బంది అన్నారు.  పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రోజుకి 10 మంది ఎంపీలతో ఆయన భేటీ అయ్యేవారు. 

ఆయన బిజీ సమయంలో మన్మోహన్ సింగ్ కి తన వ్యక్తిగత అభిప్రాయాలను, పరిశీలనలను గ్రంధస్తం చేసే సమయమే మిగిలేదు కాదు.  పైగా ఆయన, నాకా ఆలోచనే రాలేదు.  అయినా నాకు వ్యక్తిగతమైన ప్రచారం అవసరమా అని అనేవారట. 

పదవీకాలం తర్వాత మన్మోహన్ సింగ్ ముందుగా భారత నావికా దళంలో కొత్తగా చేరిన రష్యన్ నిర్మిత ఐఎన్ఎస్ విక్రమాదిత్య లో ఒకరోజు గడుపుతారట.  ఎన్నికలలో ప్రచారానికి పోయి కనీసం ఆరేడు బహిరంగ సభలకు హాజరవుతారట.  ఎన్నికల వ్యూహరచనలో కూడా ఆయన భాగం పంచుకుంటానంటున్నారట.  ప్రతిపక్ష నాయకుడు నరేంద్ర మోదీ విషయంలో ఆర్ధిక మంత్రి చిదంబరం లాగా హేతుబద్ధంగా నిజాలతో గణాంకాలతో ఎదుర్కోవాలని అన్నారటాయన. 

అలాగని మన్మోహన్ సింగ్ మాటలు చేతకానివారు కాదు.  పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ ఆయనను పాకిస్తాన్ కి ఆహ్వనిస్తూ, రండి అక్కడ గురుద్వారాలను సందర్శించవచ్చు అన్నప్పుడు, దయచేసి నా మతాన్ని ఇందులోకి లాగకండి అన్నారాయన.  ఆయన్ని మళ్ళీ మళ్ళీ శక్తిహీనుడిగా ప్రతిపక్షం అభివర్ణిస్తుంటే, ఆ విషయం నాకు తెలియదు.  నేను శక్తిహీనుడనని అనుకోవటం లేదు.  ఒక వేళ అమాయకులైన పౌరులను అహ్మదాబాద్ నడిబొడ్డున పొట్టనపెట్టుకోవటమే శక్తికి నిదర్శనమనుకుంటే ఈ దేశానికి అటువంటి శక్తి అవసరం లేదు, అటువంటి ప్రధానమంత్రి అవసరమం ఎంతమాత్రం లేదని మీడియా సమావేశంలో దీటుగా జవాబిచ్చారాయన. 

ఆయనను ఎక్కువగా బాధించిన విషయం పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం- ముఖ్యంగా రాహుల్ గాంధీ.  సోనియా గాంధీ సహాయ సహకారాలను ఆయన ఎప్పుడూ శ్లాఘిస్తుంటారు.

నేను నా అవగాహన మేరకు నా దేశానికి సేవ చేసాను.  అంకితభావంతో పని చేసాను. నేను నా ప్రయత్నంలో ఎంత సఫలీకృతుడనయ్యానన్నది నా దేశవాసులే చెప్పాలి అంటారు మన్మోహన్ సింగ్. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles