Congress shielding sheila dikshit

Congress shielding Sheila Dikshit, Aam Admi Party, Arvind Kejriwal, Delhi CM Sheila Dikshit, Kerala Governor Sheila Dikshit, Kejriwal instigates charges on Sheila Dikshit

Congress shielding Sheila Dikshit

షీలా దీక్షిత్ కి కాంగ్రెస్ షీల్డ్

Posted: 03/05/2014 03:06 PM IST
Congress shielding sheila dikshit

మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కేరళ రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులయ్యారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆఆపా నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  1998 నుండి ఢిల్లీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ తిరుగులేని శక్తిగా ఉన్న షీలా దీక్షిత్ ని కేజ్రీవాల్ ఒక్కసారిగా వెనక్కి తోసేసి మూడో స్థానంలో పడేసారు.  అయితే 49 రోజులు మాత్రమే ఢిల్లీ గద్దె మీద పాలన చెయ్యగలిగిన కేజ్రీవాల్ ఆ కొద్దిరోజుల్లోనూ మూడురోజులు పోలీస్ శాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలోనే గడిపారు. 

కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యకముందే షీలా దీక్షిత్ మీద అవినీతి చట్టం కింద కేసులను బుక్ చేయించారు.  ఇప్పుడు ఆమెను గవర్నర్ గా నియమించటంతో ఆమె మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండవు.  అదే కాంగ్రెస్ దురాలోచన అన్నారు కేజ్రీవాల్. 

ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం తగదని కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు విమర్శించారు.  వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం తగదని వాళ్ళన్నారు. 

భారత రాజ్యాంగంలోని 361 (2) ప్రకారం భారత రాష్ట్రపతి, రాష్ట్రంలోని గవర్నర్లు పదవిలో ఉన్నకాలంలో వాళ్ళమీద ఏ కోర్టులోనూ క్రిమినల్ కేసులు విచారణ జరపగూడదన్న నియమం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య కూడా కేసులను ఎదుర్కుంటున్న సమయంలో ఆయనను తమిళనాడు గవర్నర్ గా పంపించటం జరిగింది.   కానీ ఆ కేసులో ఎసిబి ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు పంపించటం కూడా జరిగింది.  పిటిషనర్ తరఫున వాదించిన లాయరు, రోశయ్య గవర్నర్ గా నియమితులైన ముందు నుంచే ఈ కేసులు ఆయన మీద ఉన్నాయని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles