Nallari kiran kumar reddy chapter now a history

kiran, nallari kiran kumar reddy, nallari, former cm for andhrapradesh, resigned against ap state bifurcation bill 2013, ap history, first cm ap nilam sanjiva reddy, ap lost cm nallari kiran kumar reddy.

nallari kiran kumar reddy chapter now a history

చరిత్ర పుస్తకల్లో నల్లారి పేరు?

Posted: 03/01/2014 03:22 PM IST
Nallari kiran kumar reddy chapter now a history

చరిత్ర పుస్తకల్లో నల్లారి కిరణ్  కుమార్ రెడ్డి ఎక్కనుందని  రాజకీయ మేథావులు అంటున్నారు.  మరో రెండు రోజుల్లో  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుంది.  ఇప్పటికే రాష్ట్ర విభజన పై కేంద్రం క్లారీటీగా చెప్పటం జరిగింది.

 కేంద్రం ఇచ్చిన క్లారిటీ దెబ్బకు .. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  అసలు ఇంతకీ  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చరిత్ర పుస్తకాల్లో ఎందుకు ఎక్కుతుందంటే?  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  సమైక్యాంద్ర కోసం చివరి బంతి వరకు పోరాడినందుకు కాదులేండి.  

ఆంద్రప్రదేశ్  ఆఖరి ముఖ్మమంత్రి గా  పనిచేసినందుకు  చరిత్రలో  నల్లారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఏపీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గురించే మాట్లాడుకునే సమాజం.. ఇక మీదట ఏపీ చివరి ముఖ్యమంత్రి గురించి కూడా చెప్పుకొంటారు. 

కిరణ్ రాజీనామా చేయడం.. తదనంతరం మరో ముఖ్యమంత్రిని నియమించకుండా కేంద్రం రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపిన నేపథ్యంలో.. కిరణ్ పై ఈ అరుదైన రికార్డు నమోదయ్యే అవకాశాలున్నాయి.  ఈ రికార్డు పై నల్లారి బాబు  మనసులో నవ్వుకుంటున్నట్లు సమాచారం. 

నోట్.. ఇక నుండి ..నీలం మరిచిపోయి.. నల్లారి ని గుర్తుపెట్టుకోవాలి. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles