Kishore chandra deo wants vizag to be seemandhra capital

Kishore Chandra Deo, vizag capital, Seemandhra capital, Union Minister V Kishore Chandra Dev, AP Bifurcation, Visakhapatnam, Visakhapatnam capital, Andhra's capital.

Kishore Chandra Deo wants Vizag to be Seemandhra capital

రాజధాని విశాఖ..

Posted: 02/27/2014 11:35 AM IST
Kishore chandra deo wants vizag to be seemandhra capital

రాష్ట్ర విభజన జరిగినపోయిన తరువాత  కాంగ్రెస్ హైకమాండ్ కు  మరో సమస్యపై తలమునకలవుతున్నారు.  రాష్ట్ర విడిపోయిన బాధలో  ఉన్న సీమాంద్ర ప్రజలకు.. మంచి, ది బెస్ట్  రాజధాని ఎక్కడ ఎక్కడ ఏర్పాటు  చేయాలనే ఉద్దేశంలో  కాంగ్రెస్ పెద్దలు  కసరత్తలు చేస్తున్నారు. అయితే  సీమాంద్ర నేతల నుండి కొన్ని డిమాండ్స్  వస్తున్నాయి.  

మా ప్రాంతాన్ని  రాజధాని చేయాలని  ఆయా ప్రాంతాల నాయకులు, ప్రజలు  ప్రభుత్వం పై  ఒత్తిడి పెంచుతున్నారు.   సీమాంద్ర కాంగ్రెస్ పార్టీ నేతలే.. రాజధాని విషయంలో పోటీ పడుతున్నారు. 

 ఎవరికి వారే మా ప్రాంతాన్ని  రాజధాని చేయాలని  కోరుతున్నారు.  కర్నూలు  రాజకీయ నేత అయితే  ఏకంగా  సీమాంద్రకు  రెండు రాజధానులు కావాలని   డిమాండ్ చేస్తున్నారు.

 కావూరి-గుంటూరు,  టిజీ వెంకటేష్ -కర్నూల్,  చింతమోహన్ -తిరుపతి,  మాగుంట  శ్రీనివాసరెడ్డి -ఒంగోలు,  కిషోర్ చంద్రదేవ్ - విశాఖపట్నం ప్రాంతాలలో రాజధాని చేయాలని    సీమాంద్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

అయితే  ఈరోజు కిషోర్  చంద్రదేవ్  మాట్లాడుతూ.. కొత్త రాజధానికి విశాఖ అనుకూలమైన ప్రాంతమని ఆయన బవ్యాఖ్యానించారు. సీమాంధ్రకు స్వయంప్రతిపత్తి పదేళ్లు ఇవ్వాలని కిషోర్ చంద్రదేవ్ సూచించారు. 

విశాఖ ఏజెన్సీ పర్యటన సందర్భంగా ఆయన  రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం విశాఖపట్టణమేనని, సీమాంధ్ర ప్రాంతానికి విశాఖపట్టణమే రాజధానికి సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచడం కన్నా విశాఖను రాజధానిని చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఈమేరకు కిషోర్ చంద్రదేవ్ గతంలో  కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి లేఖ కూడా రాశారు. కిశోర్ చంద్రదేవ్ విశాఖ జిల్లా అరకు నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles