Manchu lakshmi lgbt rally in hyderabad

Manchu lakshmi, LGBT rally in hyderabad, subhodaya charitable organization, lesbian gay bisexual transgender.

Manchu lakshmi LGBT rally in hyderabad

మంచు వారి అమ్మాయిది చాలా మంచి మనసు

Posted: 02/24/2014 01:15 PM IST
Manchu lakshmi lgbt rally in hyderabad

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. టాలీవుడ్ తమకంటూ ఒక ఇమేజ్  ఉండాలని నిత్య కష్టపడే  వారిలో.. మంచు కటుంబం అని చెప్పుకోవాలి.  తండ్రి మోహన్ బాబు క్రమశిక్షణలో  పెరిగిన టాలీవుడ్ ఆణిముత్యాలు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్. ఈ ముగ్గురికి ఉన్న స్వేచ్చ టాలీవుడ్ లో  మరేవ్వరికి వారి  తల్లిదండ్రులు ఇవ్వలేదు.  ఈ ముగ్గురు  వెండితెరపైనే .. తమ సత్తా చాటుకుంటున్నారు.  

కొంత మంది స్టార్ హీరోగా ఎదిగినప్పటికి తల్లిదండ్రి చాటు పిల్లలుగానే మిగిలిపోతున్నారు.  కానీ  మంచు అమ్మాయి అలా కాదు  నిరూపించారు.  ఏదైన సమాజానికి మంచి తండ్రి కి పేరు తేవాలనే తప్పన  మంచు లక్ష్మీలో బాగా కనిపిస్తుంది.  ఎంతో మందికి  మనసులో ఏదో చెయ్యాలని కోరిక ఉంటుంది కానీ దాన్ని బయటపెడితే..  ఎదుటివారు ఏమైన అనుకుంటారేమో అని ఇగో తో ముందుకు రాలేరు. కానీ  మంచు లక్ష్మీ అలా తన మనసులో ఏం చెయ్యాలనిపిస్తే అదే  చేయటం లక్ష్మీస్పెషల్. 

అయితే ఈరోజు మంచు లక్ష్మీ ఒక మంచి  కార్యకర్రమానికి పూనుకుంది.  అనాధిగా  సమాజంలో  ఆదరణ కోల్పోతున్న ఎల్ జీబిటి(లెస్ బియన్స్ , గే, సెక్సువల్స్ అండ్ ట్రాన్స్ జెండర్ )లు అండగా నిలిచి , వారి  ర్యాలీని  ముందుండి మంచు లక్ష్మీ నడిపించారు.  ఈ రోజు   హైటెక్ సిటీ  రైల్వే స్టేషన్  నుంచి  శిల్పారామం  వరకు  సురక్ష  సంస్థ  ఆద్వర్యంలో  ‘హైదరాబాద్  క్యూర్  ప్రైడ్ ’ పేరిట ర్యాలి నిర్వహించారు. 

ఎల్ జీబిటి  సమస్యలను  ప్రభుత్వం పట్టించుకోవాలని  మంచు లక్ష్మీ డిమాండ్ చేశారు.  వీరికి ఆధార్ కార్డు కూడా  ఇవ్వటం లేదని, వెంటనే వీరికి సమాజంలో గుర్తింపు కార్డులు ఇవ్వాలని  మంచు లక్ష్మీ డిమాండ్ చేయటం జరిగింది.  

ఇలా తమ సమస్యల పట్ల .. మంచు లక్ష్మీ పోరాటం  చేయటం  చాలా ఆనందంగా ఉందని, ఇలాగే ప్రతిఒక్కరు మమ్మల్నీ అర్థం చేసుకోవాలని  ఎల్ బిజీటి లు కోరుతున్నారు.  ఏమైన మంచు లక్ష్మీ దైర్యానికి  మొచ్చుకోవాలని  మహిళ సంఘాలు అంటున్నాయి.  ఏమైన మంచు వారి రూటే సపరేటు అని మంచు లక్ష్మీ నిరుపించింది. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles