Lagadapati explains his actions in parliament

Lagadapati explains his actions in Parliament, Rajagopal pepper spray, Pepper spray in parliament, Frisking of MPs in Parliament

Lagadapati explains his actions in Parliament

పార్లమెంట్ సంఘటన మీద లగడపాటి విచారం

Posted: 02/14/2014 02:22 PM IST
Lagadapati explains his actions in parliament

పార్లమెంటులో గురువారం రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో జరిగిన సంఘటన అవాంఛనీయమని, దాన్ని ఎవరు చేసినా తప్పేనని అన్న లగడపాటి రాజగోపాల్ ఏ పరిస్థితులు అందుకు దారితీసాయో తెలపవలసిన అవసరం ఉందని ఢిల్లీ మీడియాలో తెలియజేసారు. 

జరిగినదానికి తాను ఎంతో సిగ్గుపడుతున్నానని చెప్పిన లగడపాటి రాజగోపాల్ పార్లమెంటులో పథకం ప్రకారం తనమీద 100 మంది ఎంపీలతో దాడి జరిగిందని, తోటి ఎంపీ మీద చెయి చేసుకుంటుండగా తాను వెళ్ళానని, అంతమందితో పోరాడలేక ఆత్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పెప్పర్ స్ప్రే చెయ్యవలసివచ్చిందని అన్నారు. 

జరిగినదానికి తానెంతో చింతిస్తున్నానని, అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే తనమీద దాడులు జరిగాయని లగడపాటి అన్నారు.  ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవటం దురదృష్టకరమని చెప్పిన లగడపాటి జరిగిన విషయమేమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని పై విధంగా విశదీకరించారు.

పార్లమెంటులో ప్రవేశించే ఎంపీలను తనిఖీలు చేసే ఆనవాయితీ ఇంతవరకు లేదు.  కానీ నిన్నటి సంఘటనతో ఎంపీలను కూడా తనిఖీ చేసి లోపలకు పంపించాలనేప్రతిపాదన వచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles