Apngos chalo parliament in february

APNGOs chalo parliament in February, APNGOs Association, APNGO President Ashok Babu, Telangan Bill

APNGOs chalo parliament in February, APNGOs President Ashok Babu

ఏపిఎన్జీవోల చలో పార్లమెంట్ కార్యక్రమం

Posted: 01/28/2014 08:56 AM IST
Apngos chalo parliament in february

ఎపిఎన్జీవో భవన్ లో మాట్లాడిన ఎపిఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు భవిష్యత్తులోని కార్యక్రమాలను తెలియజేస్తూ, రాష్ట్ర పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరిలో ఢిల్లీలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. 

ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పిన అశోక్ బాబు ఈ లోపులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో ఫిబ్రవరి 3 న విస్తృత స్థాయిలో సమావేశం జరుగుతుందని తెలియజేసారు. 

బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా తయారైంది కనుక దాన్ని ఓడించటానికి పూర్తిగా కృషి చేయాలని రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేసామన్నారు అశోక్ బాబు.  కాకపోతే బిల్లు మీద ఏర్పడ్డ సంక్లిష్ట పరిస్థితిని చూస్తే బిల్లుని ఓడించినా లేక తిరస్కరించి వెనక్కి పంపించినా సరే అది పార్లమెంటుకి పోయే అవకాశం ఉందని, అందుకే ఢిల్లీలో కార్యక్రమాల రచన జరుగుతోందని అన్నారాయన. 

అయితే ఢిల్లీలో ఎన్నిరోజుల వరకు నిరసన జరుగుతుందన్న సంగతి ఇప్పుడే చెప్పలేమని, పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని చెప్పారు అశోక్ బాబు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles