21 die in boat capsized in bay of bengal

Boat capsized in Bay of Bengal, 21 die in boat capsized, Andaman Nicobar Islands, Andaman Nicobar Lt Governor, Port

21 die in boat capsized in Bay of Bengal

బంగాళాఖాతంలో మునిగిన బోటు, 21 మంది మృతి

Posted: 01/27/2014 10:14 AM IST
21 die in boat capsized in bay of bengal

స్థాయికి మించి 50 మంది ప్రయాణీకులతో అందులో ఎక్కువమంది పర్యాటకులతో విహరిస్తున్న బోటు అండమాన్ నికోబార్ ద్వీపాల రాజధాని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో బంగాళా ఖాతంలో మునిగిపోయింది.  అందులో 21 మంది మృతిచెందగా మిగిలిన 29 మందిని రక్షించటం జరిగింది. 

దుర్ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే,

అండమాన్ నికోబార్ లో అక్వా మెరైనా అనే బోటులో 32 మంది కాంచీపురం నుంచి వచ్చిన సందర్శకులే ఉన్నారు.  స్థాయికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకున్న ఆ బోటు రాస్ ఐలాండ్ సమీపంలో నీటిలో మునిగిపోయింది.  25 మంది మాత్రమే ప్రయాణం చెయ్యవలసిన బోటులో 50 మందిని ఎక్కించుకోవటం జరిగింది.  సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ బోటు బంగాళాఖాతం లో మునిగిపోయింది.  చనిపోయినవారిలో 13 మంది కాంచీపురం వాసులే ఉన్నారు.

నీటినుంచి రక్షించి తీసుకుని వచ్చిన వారిని పోర్ట్ బ్లెయిర్ లోని జి.బి.పంత్ హాస్పిటల్ లో చేర్చి వారికి వైద్య సేవలందిస్తున్నామని అండమాన్ నికోబార్ లెఫ్టెనెంట్ గవర్నర్ ఎ.కె.సింగ్ తెలియజేసారు.  చనిపోయినవారి కుటుంబాలకు లక్షరూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించిన ఎ.కే.సింగ్ జరిగిన ఘటన మీద మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశాలిచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles