Extension of time to return t bill

Extension of time to return T Bill, AP State Reorganization Bill 2013, Time limit to return T bill, Extension requested on T bill

Extension of time to return T Bill

బిల్లు మీద గడువు కుదించండి- హోంశాఖ

Posted: 01/21/2014 09:15 AM IST
Extension of time to return t bill

రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చ మొదలైంది కానీ సమగ్రంగా చర్చించటానికి ఇంకా గడువు కావాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పికె మహంతి లేఖలో నాలుగు వారాల గడువు కోరగా, దాని మీద స్పందిస్తూ గడువు కేవలం రెండు వారాలకే కుదించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. 

బిల్లు మీద చర్చించి తిరిగి పంపించటానికి రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23 న పూర్తయిపోతుండటం వలన గడువు పొడిగింపుకి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసింది.  ఆ లేఖ అక్కడి నుండి రాష్ట్రపతి దగ్గరకు పోయిన తర్వాత దాని మీద రాష్ట్ర పతి గడువు పొడిగింపు విషయంలో నిర్ణయం తీసుకుంటారు. 

అయితే, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం సమయాన్ని గడిపివేసి సమస్యను వాయిదా వేసే దుర్భుద్ధితోనే సమయనష్టం కావించి ఇప్పుడు మరింత సమయాన్ని కోరుతున్నారంటూ పార్లమెంట్ సభ్యుడు వివేక్ రాష్ట్రపతికి లేఖ రాసారు.  ఆ కారణంగా బిల్లుని తిరిగి పంపించటానికి అసలు గడువుని పొడిగించనేవద్దని రాష్ట్రపతిని కోరారాయన. 

గడువు పొడిగింపు అభ్యర్థన లేఖ రాష్ట్రపతి కార్యాలయానికి చేరినట్లు తెలిసింది.  దానితో ఈ విషయంలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు ఈ రోజు తెరపడవచ్చుననిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles