Center wants to get through t bill

Center wants to get through T bill, Gulam Nabi Azad, Home Minister Sushil Kumar Shinde, Telangana bill, Central Govt

Center wants to get through T bill

నయానో భయానో తె బిల్లుని గట్టెక్కిస్తున్న కేంద్రం

Posted: 01/09/2014 09:12 AM IST
Center wants to get through t bill

కేంద్రం నుంచి వచ్చినప్పుడల్లా ఒక కొత్త ప్రతినిధి వస్తుంటారు.  అలాగే ఈ సారి గులాం నబీ ఆజాద్ ఢిల్లీ నుంచి వచ్చారు.  బుధవారం జరిగిన పివి నరసింహారావు వర్ధంతి సభలో మాట్లడిన గులామ్ నబీ ఆజాద్ రాష్ట్ర శాసనసభలో చర్చ జరుగుతుందని, జనవరి 23 కల్లా అది పూర్తవుతుందని తనకున్న నమ్మకాన్ని గట్టిగా చెప్పారు.  

రాజకీయనాయకులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ లేని అంత గట్టి నమ్మకం ఆజాద్ కి వచ్చిందంటే దానికి ఆధారం కేంద్ర ప్రభుత్వానికున్న వ్యూహరచన అటువంటిదన్నమాట.  కొత్త ప్రతినిధి వచ్చినప్పుడల్ల మన రాష్ట్ర నాయకులంతా క్యూ కట్టి వాళ్ళ వాళ్ళ ఉద్దేశ్యాలను వెలిబుచ్చుతుంటారు.  దానితో వివరాలన్నిటినీ సేకరించటం, వాటిని కేంద్రానికి చేరవేయటం జరుగుతుంది.  రెండవది వాళ్లకి ఇష్టమైన విషయాలను చెప్పదలచుకున్నవాటిని చెప్తారు, మిగతావాటి విషయంలో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు.  లేదా చూస్తాం మాట్లాడతాం అంటారు.  

ఇక్కడ ఎవరికీ ఏమీ అర్ధం కావటం లేదు కానీ అంతా సవ్యంగా జరుగుతుందన్న నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక పక్కనుంచి చెప్తూ రెండో పక్క మీరు ఏమీ చెయ్యకపోయినా పార్లమెంటులో దానిసంగతి మేం చూసుకుంటామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన ద్వారా తెలియచేస్తోంది.  

రాష్ట్ర ప్రజలంతా ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠతో చూసి చూసి చికాకుతో ఏం జరిగితే అది జరుగుతుందిలే అనుకునే సమయంలో తిరిగి ఒక కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేస్తూ తెలంగాణా అంశాన్ని మాత్రం తాజాగా ఉంచుతున్నారు.

ఆజాద్ రాక మాత్రం బిల్లుని గట్టెక్కించటానికి చేసే ప్రయత్నంలో ఒక భాగమేనని అర్ధమౌతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles