Statewide bandh on friday

statewide bandh on friday, Samaikya Rashtra Parirakshana Vedika, Ashok Babu, APNGO's Association, AP Employees Associations, Bandh support by TDP YSRCP and SP

statewide bandh on friday

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బంద్

Posted: 01/03/2014 08:30 AM IST
Statewide bandh on friday

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది.  ఈ రోజు రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదా శాసన సభలో చర్చకు రానుంది.  దాన్ని వ్యతిరేకిస్తూ చేసిన బంద్ పిలుపుకి ఎపిఎన్జీవోలు, మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా మద్దతునిస్తున్నాయని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్ అశోక్ బాబు తెలియజేసారు. 

ఉద్యోగ సంఘాలే కాకుండా రాజకీయ పార్టీలు కూడా బంద్ కి మద్దతునివ్వటం విశేషం.  కాంగ్రెస్ పార్టీ, తెదేపా, వైకాపా, సమాజ్ వాదీ పార్టీలు బంద్ లో పాల్గొంటున్నాయి. 

చేసేద్ పునర్విభజన బిల్లుకి వ్యతిరేకంగానైనా, తెలంగాణా ప్రాంతంలో కూడా సమైక్యాంధ్రను కోరుకునేవారుండబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చామని అశోక్ బాబు అన్నారు. 

కృష్ణా, కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి బంద్ పాటిస్తున్నట్టుగా సమాచారం అందింది.  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో తెలుగు దేశం తమ్ముళ్ళు ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా బైఠాయించి ఆందోళన చేపట్టారు.  రాస్తారోకోలు, బస్సులను నిలిపివేయటాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. 

విజయవాడ, గుడివాడలలో ఆందోళనకారులు బస్సులను అడ్డుకోగా బస్సులు డిపోలకే పరిమితైవున్నాయి.  కడప జిల్లాలోని 8 డిపోలలో 900 బస్సులు డిపోనుంచి బయటకు రాలేదు.  గుంటూరులో బంద్ ముమ్మరంగా సాగుతోంది.  విద్యాసంస్థలు ముందే మూసివేయగా దుకాణాలను, బ్యాంకులు, సినిమా హాళ్ళను మూసి వెయ్యటానికి తెదేపా వైకాపాలు విడివిడిగా పోటాపోటీగా బంద్ ని నిర్వహిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles