170 houses gutted in fire broke at kakinada

170 burned in Kakinada, Thatched houses gutted in Kakinada, Fire broke at Kakinada, Kakinada fire accident, Kakinada fire loss 30 lakh

170 houses gutted in fire broke at Kakinada

కాకినాడలో అగ్నికి ఆహుతైన 170 పేదల ఇళ్ళు

Posted: 01/02/2014 09:07 AM IST
170 houses gutted in fire broke at kakinada

నిన్న రాత్రి 10.30 ప్రాంతంలో కాకినాడలోని కొత్తపాకలలో 170 పేదల ఇళ్లు అగ్నికి అహుతయ్యాయి.  కాకినాడలో దుమ్మలపేట ప్రాంతంలో దగ్ధమైన ఆ ఇళ్ళన్నీ పేదల పూరిపాకలే.  తాటాకులతో కప్పిన ఇళ్ళవటం వలన మంటలు వేగంగా అందుకుని నివాసితులందరికీ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కట్టుబట్టలతో బయటకు పరుగులు తీయవలసివచ్చింది. 

దాదాపు 30 లక్షల రూపాయల విలువైన నష్టం జరిగుంటుందని అంచనా వేస్తున్నారు.  కష్టపడి చెమటోడ్చి కూడబెట్టుకున్న వస్తువులన్నీ మంటలలో మసైపోతుంటే చేసేదేమి లేక దూరం నుంచే చూస్తూ దుఖాతిశయంతో చేసే ఆర్తనాదాలు చాలా దూరం వరకు వ్యాపించాయి. 

సమాచారం అందగానే అగ్నిమాపక దళాలైతే చేరుకున్నాయి కానీ అప్పటికే వేగంగా వ్యాపించిన మంటలు బూడిదను మాత్రమే మిగిల్చాయి.  జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles