Seemandhra mps news story in t bill

seemandhra congress mps, rebel seemandhra mps, seemandhra mps news story in t-bill, telangana bill, telangana war, lokpal bill, loksabha, parliament passes lokpal bill, telangana bill in parliament, political news, latest telugu news, breaking news, headlines

seemandhra mps news story in t-bill

టి-బిల్లును రానీవ్వకుండా చేశాం?

Posted: 12/18/2013 04:43 PM IST
Seemandhra mps news story in t bill

తెలంగాణ బిల్లు పై సీమాంద్ర ఎంపీలు కొత్తరకం బాణి వినిపిస్తున్నారు. ఈరోజు తో పార్లమెంట్ సమావేశాలు ముగిసాయి. దీంతో సొంత పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ పార్టీ సీమాంద్ర ఎంపీలు .. కొత్త కథ చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును రానీవ్వకుండా చేయగలిగామని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అన్నారు. లోక్ సభ వాయిదా అనంతరం ఆయన మాట్లాడారు.

 

రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 70-80మంది సభ్యులు మద్దతు ఉందన్నారు. స్పీకర్ ముందు అనేక విషయాలను లేవనెత్తామని సబ్బం హరి తెలిపారు. ప్రజలు జరుగుతున్న విషయాన్ని చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళతామని .... విభజనపై కేంద్ర వైఖరిని వారికి తెలియచేస్తామని సబ్బం హరి తెలిపారు.

 

కాగా లోక్ సభలో ఈరోజు లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. దాంతో సోనియా వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ బిల్లు పై అసెంబ్లీ లో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ తెలంగాణ బిల్ పై మూడు రోజులు మాట్లాడే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో నినాదాలతోనే సభ వాయిదా పడింది. రేపు జరిగే అసెంబ్లీ లో రాజకీయ నాయకులు ఎలా స్పదింస్తారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles