Panel set up to study division of assets between telangana

K Vijay Kumar, taskforce, law and orders, State Bifurcation, Telangana, creation of Telangana, bifurcarion of Andhra Pradesh, high-level committee, division of assets, administrative framework, Home Minister Sushilkumar Shinde

The Centre has constituted a high-level committee headed by former CRPF Chief, K Vijay Kumar, to look at the division of assets and the administrative framework which would be required when Telangana is created upon bifurcation of Andhra Pradesh.

నేడు రాష్ట్రానికి టాస్క్ ఫోర్స్

Posted: 10/29/2013 09:00 AM IST
Panel set up to study division of assets between telangana

రాష్ట్ర విభజన పక్రియ పై వడివడిగా అడుగులు వేస్తున్న కేంద్రం తన పని తాను చేసుకొని పొతున్నంది. నాయకుల రాజీనామాలు, సీమాంధ్రుల ఉద్యమాలను లెక్కచేయకుండా విభజన ప్రక్రియను వేగవంతం చేసింది. ఓ ప్రక్కన ముసాదా బిల్లును తయారు చేస్తూనే, నీటి పంపకాలు తదితర వాటి కోసం మంత్రుల కమిటీని, మరో వైపు శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఎన్ కౌంటర్ లో కీలక పాత్ర వహించిన తమిళనాడు పోలీసు అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో సభ్యులుగా ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ, రాష్ట్ర డీజీ ఆపరేషన్స్ జె.వి. రాయుడు, విశ్రాంత డీజీపీ ఎ.కె. మహంతి, జాతీయ పరిశోధనా సంస్థకు చెందిన అధికారి ఎస్.ఆర్. వాసన్, విభజన అంశాల్లో అనుభవం ఉన్న మధ్యప్రదేశ్ అదనపు డీజీపీ డి.ఎస్. మిత్రా, ఒడిశాకు చెందిన అభయ్ కుమార్ , సరిహద్దు భద్రతా దళం అధికారి సంతోష్ మెహ్రా, కేంద్ర హోంశాఖ కు చెందిన ఉన్నతాధికారి శంతను, సరిహద్దు రహదాల సంస్థకు చెందిన అన్షుమన్ యాదవ్ లో ఉన్నారు.

వీరి బృందం నేడు రాష్ట్రానికి రాబోతుంది. కేంద్ర హోం శాఖకు చెందిన ఈ టాస్క్ ఫోర్స్ బృందం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా సంస్థకు చెందిన సుపరిపాలనా భవనంలో సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్ కు సంబందించి శాంతిభద్రతల విషయంలో ఎలా నిర్వహించాలన్న తదితర అంశాలను ఈ టాస్క్ పోర్స్ పరిశీలిస్తుంది. వచ్చే నెల ఐదు నాటికి వీరు నివేదిక ఇవ్వవలసి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles