Tdp invites pawan and nagababu

Pawan Kalyan, Nagababu join TDP, Pawan Kalyan, Politics,Tdp, Chiranjeevi, Chandrababu,NTR, Pawan Kalayan,TDP,Somireddy Chandra Mohan Reddy,Naga Babu,Yanamala ramakrishnudu

Pawan Kalyan, Nagababu join TDP, Pawan Kalyan, Politics,Tdp, Chiranjeevi, Chandrababu,NTR, Pawan Kalayan,TDP,Somireddy Chandra Mohan Reddy,Naga Babu,Yanamala ramakrishnudu

పవన్ లాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తే...

Posted: 10/22/2013 03:41 PM IST
Tdp invites pawan and nagababu

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరబోతున్నారంటూ జోరుగా వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ వార్తల పై తెలుగు దేశం పార్టీ నేతలు కూడా స్పదించారు. పవన్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం అయిందని, ఆ మేరకు బాలక్రిష్ణతో కూడా చర్చలు పూర్తయ్యాయని ఇక చేరిక ఆలస్యం అన్నట్లు ఉండటంతో ఆ పార్టీ సీనియర్ నేతలు అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు స్పంచారు. తెలుగు దేశం పార్టీలోకి పవన్ కళ్యాణ్ వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని,

అవినీతి పరులకు తప్ప ఎవరికైనా ఈ పార్టీలో చోటు ఉంటుందని, ప్రజలకు మంచి చేసే వ్యక్తి సమాజంలో ఉంటే బాగుంటుందని, అలాంటి వాడినే ప్రజలు కోరుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచోడు అనే పేరు ఉందని, పదిమందికి సాయం చేసే గుణం ఉందని నేను విన్నానని, అలాంటి వ్యక్తికి టీడీపీలో ఎప్పుడు తలుపు తెరిచే ఉంటాయని, ఆయన ఈ పార్టీలో చేరుతున్నాడో లేదో మాత్రం ఆయన్నే అడగాలని సోమిరెడ్డి అన్నారు. మరో నేత యనమల మాట్లాడుతూ...

పవన్ కళ్యాణ్, నాగబాబు టీడీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పోరాడేందుకు టీడీపీ సరైన వేదిక అని పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నేతలే ఈ విషయం పై స్పందించే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎంత వరకు అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కన పెట్టడానికే పవన్ ని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles