Tdp chandrababu will go with nda

TDP Chandrababu will go with NDA, Chandrababu will go with NDA, National Democratic Alliance, Telugu Desam Party, TDP leader N Chandrababu Naidu, TDP, BJP

TDP Chandrababu will go with NDA, Chandrababu will go with NDA

సూపర్ పవర్ గా ఎదిగే రోజు దగ్గర్లోనే ఉంది : బాబు

Posted: 10/02/2013 01:55 PM IST
Tdp chandrababu will go with nda

ఎన్డీఏ, తెలుగుదేశం హయాంలో సైబరాబాద్ ను నిర్మించామని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల జయంతి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో గౌరవంగా ఉందన్నారు. గాంధీ, మోడీ ఇద్దరిదీ గుజరాత్ కావడం కాకతాళీయమన్నారు. ఇండియా సూపర్ పవర్ గాఅవతరించే రోజు దగ్గర్లోనే ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు దేశం హయంలో విద్యుత్ ఉత్సాదనలో అగ్రశ్రేణిలో నిలిచేందుకు అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించామన్నారు. ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, న్యాయ విశ్వవిద్యాలయం బిజినెస్ స్కూల్ తెచ్చామన్నారు. ట్రంక్ కాల్ మాట్లాడుకునే రోజుల్లో ఎన్డీఏతో కలిసి సెల్ సేవలు తీసుకొచ్చామని వివరించారు. దేశంలో అవినీతి, వెనుకబాటుతనాన్ని జాతీయ అంతర్జాతీయ మీడియా తూర్పారపడుతోందని చంద్రబాబు అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles